బాలీవుడ్ లో మంచి పేరు కొట్టెయ్యడానికి ఇక్కడ అన్నం పెట్టిన టాలీవుడ్ ని కించపరచడానికి సిద్ధమైపోయిన తాప్సి ఇప్పుడు దిగొచ్చింది. టాలీవడ్ లో సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు ని అవమానిస్తూ మాట్లాడిన తాప్సికి ఇప్పుడు బుద్దొచ్చింది. అందుకే నేను సరదాగా అన్న మాటలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుంది అంటూ ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చింది. అసలు నా ఫస్ట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారిని నేనెలా కామెంట్ చేస్తాను.... నేను ఆయన మీద సరదాగా వ్యాఖ్యలు చేశాను కానీ ఈ విషయంపై ఇంత సీరియస్ గా రచ్చ జరుగుతుందని అనుకోలేదంటూ సారీ చెప్పేసింది.
అయితే తాప్సి ఇలా కిందకి దిగిరావడానికి కారణం లేకపోలేదంటున్నారు. తాప్సికి బుద్ది చెప్పడానికి టాలీవడ్ ఎప్పుడో సిద్ధమైంది. అందుకే తాప్సి తన కెరీర్ కి ఎక్కడ దెబ తగులుతుందో అనే భయంతోనే ఇలా సారీలు గట్రా చెబుతుందని.... లేకుంటే తాప్సి ఇలా సారీలు చెప్పదంటున్నారు. అందులోను ఇప్పుడు టాలీవుడ్ లో తాను లీడ్ రోల్ లో నటించిన 'ఆనందో బ్రహ్మ' చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో తన మీద వ్యతిరేఖత ఇలా కొనసాగితే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేస్తుందని కూడా తాప్సి ఇలా సారీ చెప్పిందంటున్నారు.
మరి కె రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్ నే కించపరిచేలా మాట్లాడిన తాప్సిని పిలిచి ఎవరూ టాలీవుడ్ లో అవకాశం ఇవ్వరు. అందుకే ఆకాశంలో విహరిస్తున్న అమ్మడు ఇలా నేలమీదకి దిగొచ్చిందనే కామెంట్స్ పడుతున్నాయి.