బాలకృష్ణ ఒక్కసారి ఎవరినైనా నమ్మాడంటే ఇక వదిలిపెట్టడు. ఆయనకు దగ్గరకావడమే కష్టం గానీ, దగ్గరై మెప్పిస్తే మాత్రం నెత్తిన పెట్టుకుంటాడు. అలా ఆయన ఎందరో దర్శకులకు, నటీనటులకు, నిర్మాతలకు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు. ఇక ఆయన నటించిన వందో చిత్రం వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌లేని క్రిష్‌కి చాన్స్ ఇచ్చాడంటే ఆయన మెంటాలిటీ ఏమిటో అర్ధమవుతోంది.
ఇప్పుడు ప్లాఫ్‌లలో ఉన్న పూరీతో 'పైసా వసూల్' చేస్తున్నాడు. ఆ తర్వాత తన 102 వ చిత్రంగా సి.కల్యాణ్‌కి ప్రమోషన్ ఇచ్చి, తమిళంలో వరుస ఫ్లాప్‌లతో నేటి ట్రెండ్‌ని ఆకట్టుకోలేకపోతున్నాడన్న విమర్శలను ఎదుర్కొంటున్న కె.ఎస్.రవికుమార్‌కి అవకాశం ఇచ్చాడు. 'లింగా' వంటి డిజాస్టర్‌తో అందరినీ ముంచిన ఈయనకు 'నరసింహ' తర్వాత చెప్పుకోదగ్గ హిట్టే లేదు. అయినా మన బాలయ్య నమ్మాడు. నమ్మడమే కాదు. మరో చిత్ర విచిత్రం కూడా చేస్తున్నాడు.
ఈ 102వ చిత్రానికి అందరూ దేవిశ్రీని పెట్టుకోంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని సగంలో వదిలేసిన దేవిశ్రీని కాదని, తన కోసం 'గౌతమీపుత్ర శాతకర్ణి'వంటి చారిత్రక చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్‌ని కె.యస్.రవి కుమార్ చిత్రానికి సంగీత బాధ్యతలను అప్పగించాలని ఆయన నిర్మాత సి.కళ్యాణ్‌ని, దర్శకుడు కె.యస్.రవికుమార్‌ని ఆజ్ఞాపించాడట. సో.. బాలయ్య మరీ పిలిచి ఇచ్చిన ఈ రెండో చిత్రం.. అందునా పక్క మాస్ చిత్రానికి చిరంతన్ భట్ ఎలాంటి సంగీతాన్ని అందించి బాలయ్యను మెప్పిస్తాదో చూడాలి...!