Advertisement
Google Ads BL

నానిని పట్టుకుంటే వదల్లేరు...!


వరుస పరాజయాల నుంచి తప్పించుకుని టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న హీరో నేచురల్‌ స్టార్‌ నాని. 'అష్టాచెమ్మా, ఈగ, పిల్ల జమీందార్‌'ల తర్వాత వరుస పరాజయాలలో ఏదో కాలం కలిసొచ్చిన హీరో అనే బ్యాడ్‌నేమ్‌ తెచ్చుకున్నాడు. ఇక హీరోగా దేనికి మరల దర్శకత్వ శాఖలోకి వెళ్లమని వెటకారం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి తాజాగా 'నిన్నుకోరి'తో మూడో హ్యాట్రిక్‌కు శ్రీకారంచుట్టాడు. 

Advertisement
CJ Advs

ఇక నాని కూడా 'నిన్నుకోరి'ని కేవలం క్లాస్‌ సినిమాగా భావించాడు. అందుకే సారీ కూడా చెప్పాడు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం బి, సీ సెంటర్లలో కూడా మాస్‌ ప్రేక్షకుల ఆదరణను కూడా చూరగొంటోంది. ఓవర్‌సీస్‌ నుంచి చిన్న చిన్న పట్టణాలలో కూడా కనకవర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రంలో నానికితోడుగా నివేదా థామస్‌, ఆది పినిశెట్టిలకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. ఇక నుంచి నివేదా థామస్‌ ని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాసేలా ఆమె నటన ఉందని కొరటాల శివ కూడా కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు. 

కాగా నివేదాకి ఇది నానితో రెండో సినిమా. 'జెంటిల్‌ మేన్‌'లో నానితో జోడీ కట్టిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు 'నిన్నుకోరి'తో సెకండ్‌ హిట్‌ కొట్టి హిట్‌పెయిర్‌ అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌ సరసన చేస్తుండటంతో ఈమె భవిష్యత్తులో మంచిస్టార్‌ కావడం ఖాయం అంటున్నారు. 

ఇక నివేదా 'జై లవకుశ'లో బిజీగా ఉండగా, నాని దిల్‌రాజు-వేణుశ్రీరాంల 'ఎంసీఏ'తో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఫ్రీ అయ్యాక త్వరలో నాని మేర్లపాక గాంధీతో నటించబోయే చిత్రంలో కూడా నివేదానే తీసుకోవాలని భావిస్తున్నారట. మరో కొద్ది రోజుల్లో దీనిపై అఫీషియల్‌ ప్రకటన వస్తుందంటున్నారు ఇలా అయితే ఇక ఈ జోడీ హ్యాట్రిక్‌ కొట్టినట్లే లెక్క. 

Nani and Nivetha Thomas Again Combination Film Soon:

Nani present acting movie 'MCA' and Nivetha thomas present acting movie 'Jai Lava Kusa'. Nani and Nivetha's complete after this movies again combo film soon with Director Merlapaka Gandhi Direction.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs