Advertisement
Google Ads BL

శివగామిపై స్పందించిన స్నేహితురాలు...!

baahubali movie,madhu bala actress,ramya krishna,sivagami charator | శివగామిపై స్పందించిన స్నేహితురాలు...!

'బాహుబలి' సందడి ముగిసినా కూడా ఇంకా రమ్యకృష్ణ నటించిన 'శివగామి'పై మాత్రం చర్చ ఆగటం లేదు. ఈ పాత్రకు శ్రీదేవిని అడిగిన సంగతి.. ఆమె పెట్టిన పలు రూల్స్‌, కండీషన్ల వల్ల ఆ పాత్రకు రమ్యకృష్ణని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై రమ్యకృష్ణ స్నేహితురాలు, నటి మదుబాల స్పందించింది. ఒక పాత్ర కోసం ఎవరెవరినో సంప్రదించడం చివరకు ఎవరినో ఓకే చేయడం సినీ పరిశ్రమలో కామనే అని చెప్పింది. 

Advertisement
CJ Advs

ఆ పాత్రలు ఎవరికి రాసి పెడితే వారికే దక్కుతాయని, తాను మొదట నటించిన 'ఫూల్‌ ఔర్‌ కాంటే'లో మొదట ఎందరినో అనుకున్నారని, కానీ చివరకు ఆ పాత్ర తనకి దక్కినట్లు చెప్పింది. ఇక 'శివగామి' పాత్రను తాను తప్ప ఎవ్వరూ చేయలేరనే విధంగా రమ్యకృష్ణ పోషించిందని పొగడ్తల వర్షం కురిపించింది. ఆ పాత్రను ఆమె తప్ప ఇంకెవ్వరూ చేసినా అంతటా మెప్పించలేరు అనేంతగా నటించిందని, ఏ పాత్రనైనా చేయగల ప్రతిభ రమ్యకృష్ణకు ఉందని కితాబునిచ్చింది. 

తానేదో రమ్యకృష్ణకు స్నేహితురాలిని కాబట్టి అలా చెప్పడంలేదని, తాను ఓపెన్‌గా చెబుతున్నానని, ఈ విషయంలో సీక్రేటేమీ లేదంది. ఇక తాను రమ్యకృష్ణని కలిసినప్పుడు కూడా ఆమెకు అదే చెప్పానని, 'బాహుబలి' ఆధారంగా బుల్లితెరపై వస్తున్న 'ఆరంబ్‌' సీరియల్‌లో నేను శివగామి పాత్రను చేస్తున్నానని, ఇదికూడా కాకతాళీయమేనని, తన పాత్రను, తన నటనను రమ్యకృష్ణతో పోల్చిచూడవద్దని విజ్ఞప్తి చేసింది...! రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి ప్రియుడు'లో రమ్యకృష్ణ, మదుబాలలు కలిసి నటించిన సంగతి తెలిసిందే...! 

Madhoo says Sivagami’s role in Baahubali:

Roja actor Madhoo says it’s common for a role to be offered to many actors before an artist is finalised for the project, adds that not Sridevi but her friend Ramya Krishnan was destined to be Sivagami in Baahubali.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs