Advertisement
Google Ads BL

నవదీప్ కోసం భారీ లాబీయింగ్ జరుగుతోందట!


డ్రగ్ మాఫియాకి సంబందించిన నోటీసుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరి పేరు మీద నోటీసులు వస్తాయో అని ఒణికి చచ్చిపోతున్నారు. అయితే మరోవైపు టాలీవుడ్ లో భారీ లాబీయింగ్ స్టార్ట్ అయ్యింది అంటున్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుండి 12 మంది నోటీసులు అందుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే నోటీసులు అందుకున్నవారిలో హీరో నవదీప్ కూడా వున్నాడు. కానీ నవదీప్ తనకేపాపం తెలియదని విచారణకు హాజరవుతానని చెబుతున్నాడు. అయితే ఈ కేసు నుండి నవదీప్ ని తప్పించేందుకు ఇండస్ట్రీలోని పెద్దలు కొంతమంది రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.

Advertisement
CJ Advs

నవదీప్ గనక విచారణాధికారుల ముందు హాజరయ్యి నోరు విప్పితే గనక టాలీవుడ్లోని చాలామంది పేర్లు బయటికి వచ్చి ఎక్కడ తమ గుట్టు రట్టు అవుతుందో అనే టెన్షన్ పట్టుకోవడం వల్లనే.. నవదీప్ ని ఈ కేసు నుండి తప్పించాలనుకుంటున్నారట. నవదీప్ పై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేందుకు టాలీవుడ్ పెద్ద తలకాయలు భారీ ఎత్తున లాబీయింగ్ మొదలెట్టినట్టు చెబుతున్నారు. ఇంతకుముందే నవదీప్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు గతంలో డ్రగ్స్ లింకులు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి.

ఇక ఇండస్ట్రీలోని ప్రముఖులతో సంబంధాలు ఉన్న నవదీప్ ఈ మధ్యనే కొత్తగా ఒక పబ్ ని ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినట్లు కూడా చెబుతున్నారు. ఇక సినిమాల్లో కూడా పెద్ద ప్రాజెక్ట్స్ లో నవదీప్ అవకాశాలు చేజిక్కించుకోవడానికి కారణం కూడా ఇండస్ట్రీలోని పెద్దల సహకారమే అంటున్నారు. ఈ సహకారంతోనే నవదీప్ బాగా ఆస్తులు కూడబెట్టినట్లు వార్తలొస్తున్నాయి. అందుకే డ్రగ్ కేసులో ఇరుక్కున్న నవదీప్ ని బయటపడెయ్యడానికి పెద్దతలకాయలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

Big Lobbying For Navdeep in Drugs Case:

Tollywood BIg Wigs Lobbying For Navdeep in Drugs Case. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs