Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఇదే అంటున్నారు..!


సినిమాల హిట్స్ తో ప్లాప్స్ తో పనిలేకుండా టాప్ లో కొనసాగుతున్న నటుడు టాలీవుడ్ లో ఒకే ఒక్కడున్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్. పవన్ గత సినిమా ఫలితంతో పనిలేకుండా పవన్ సినిమా సెట్స్ మీద ఉందంటే దానికి బోళెండంట హైప్ క్రియేట్ అవుతుంది. అసలు పవన్ సినిమాలకున్న క్రేజ్ మరే ఇతర హీరోలకు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే పవన్ సినిమా సెట్స్ మీదున్నప్పుడే దానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. పవన్ ఎలాంటి డైరెక్టర్ తో సినిమా చేసినా కూడా ఆ సినిమాకి విపరీతమైన బజ్ రావడమేకాదు దానికి బిజినెస్ కూడా ఆకాశంలోనే ఉంటుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా త్రివిక్రంతో చేసున్న పవన్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుంది. టాలీవుడ్ టాప్ చిత్రం బాహుబలిని పక్కన పెడితే ఇప్పుడు పవన్ సినిమాకి టాప్ లెవల్లో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉందని ఈ లెక్కన పవన్ కల్యాణే టాలీవుడ్ నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసినా పవన్ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంటుంది అంటే అది పవన్ కున్న స్టామీనానే అంటున్నారు. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో జత కట్టడం అంటే ఇక ఆ సినిమాకి ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో వేరే చెప్పక్కర్లేదు.

ఇప్పుడు పవన్ - త్రివిక్రమ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 100  కోట్ల దగ్గర దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా బయట బిజినెస్ అలాగే వుంది. ఇక పవన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్ టచ్ చెయ్యడం మహేష్ 'స్పైడర్', ఎన్టీఆర్ 'జై లవ కుశ' వల్ల కూడా జరగదంటున్నారు. అసలు పవన్ సినిమా బిజినెస్ ఫిగర్ దగ్గరికి కూడా ఆ సినిమాలు రావంటూ సోషల్ మీడియా లో న్యూస్ లు హల్ చల్ చేయడం విశేషమే మరి.

News Hul Chal in Social Media on Pawan Kalyan Craze:

Power Star Pawan Kalyan and Trivikram Srinivas Film Pre Release Business Shocked Everyone. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs