Advertisement
Google Ads BL

సొట్ట బుగ్గల చిన్నది సారీ చెప్పింది...!


బాలీవుడ్‌లో ఒక్క హిట్‌ వస్తే చాలు... దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన అమ్మడులకు కళ్లు నెత్తికెక్కుతాయి. తామేదో గొప్పగా ఊహించుకుంటారు. ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తన తొలి సినిమా చేసే అదృష్టం తాప్సికి వచ్చింది. హిట్టా ఫ్లాఫా అనేది పక్కనపెడితే ఈ చిత్రంతో ఆమెకు మంచి బ్రేక్‌ వచ్చింది. ఆమెకు వరుస అవకాశాలొచ్చాయి. కానీ ఇక్కడ రాణించలేక బాలీవుడ్‌ వెళ్లిపోయింది. 

Advertisement
CJ Advs

తాజాగా దర్శకేంద్రుడు హీరోయిన్లను చూపే స్టైల్‌పై నేషనల్‌ లెవల్‌లో ఆయన్ను కించపరుస్తూ మాట్లాడింది. తన బొడ్డుపై కూడా పూలు, పండ్లు వేస్తాడనుకుంటే కొబ్బరి చిప్ప వేశాడని, ఇదేం అందంగా, రొమాన్స్‌గా చూపించడమో తనకు అర్దంకాలేదని సెటైర్లు వేసి, ఆడియన్స్‌ నవ్వే సరికి మరింత రెచ్చిపోయింది. ఆ తర్వాత కూడా తన మాటకు కట్టుబడే ఉన్నానని, తన వ్యాఖ్యలను రాఘవేంద్రరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా అర్ధం చేసుకుని లైట్‌గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. 

కానీ ఆమె పై సోషల్‌ మీడియాలో విమర్శల పరంపర కొనసాగింది. ఎట్టకేలకు ఆమె దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. తాను 'ఝుమ్మంది నాదం' వంటి చిత్రాలకు, అలాంటి రొమాంటిక్‌సీన్లకు పనికిరానని చెప్పి, తనపై తాను సెటైర్‌ వేసుకున్నానని, రాఘవేంద్రరావుగారిని విమర్శించే ఉద్దేశ్యంతో కాదని, ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరింది. మొత్తానికి లేటయినా సారీ చెప్పడం అభినందనీయమే అయినా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా? మైక్‌ కనిపిస్తే ఊగిపోతే ఎలా చెప్మా...! 

Taapsi's Sorry to K Raghavendra Rao:

Heroine Taapsi faced flak on her derogatory comments on Darshakendrudu K Raghavendra Rao.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs