ఇప్పుడు టాలీవుడ్ అంతా డ్రగ్ మాఫియాతో అట్టుడికిపోతుంది. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది తమ సినిమాలు ఫెయిల్ కాగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ కి బానిసలుగా మారటమేకాక డ్రగ్ ముఠాతో చేతులు కలిపి టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టి కోట్లు గడిస్తున్నారు. సినిమాల్లో చిన్న చితక ఆఫర్స్ తో నెట్టుకొస్తూనే డ్రగ్స్ దందా ని చీకటి వ్యాపారంగా మలుచుకున్నారు. అయితే కేవలం చిన్న చితక హీరో హీరోయిన్స్ మాత్రమే ఈ డ్రగ్స్ కి బానిసలు కాదు. ఇండస్ట్రీలో పెద్దలమని చెప్పుకునే ప్రముఖులలో చాలామంది ఈ వ్యాపారంలో ఆరితేరిపోయారు. కానీ వారు బడా వ్యక్తులు కాబట్టి వారి పేర్లను బయట పెట్టడానికి పోలీస్ లు కూడా జంకే పరిస్థితి. ఒకవేళ పట్టుబడితే చిన్న చితక వారి పేర్లు మాత్రం బయటికి వస్తాయి గాని ప్రముఖుల పేర్లు మాత్రం బయటికి రాదు.
అసలు టాలీవుడ్ లో ఈ డ్రగ్ కేసు డొంక కదలడానికి ప్రధాన కారకుడు రవితేజ తమ్ముడు భరత్. అతను గతంలో డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు ఇప్పటివరకు నడుస్తూనే వుంది. రవితేజ తమ్ముడు సినిమాలలో సరైన అవకాశాలు లేక ఇలా డ్రగ్స్ కి ఎడిట్ అవ్వడమే కాకుండా ఆ డ్రగ్స్ వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. ఈ మధ్యన భరత్ రోడ్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే భరత్ చనిపోయినప్పుడు ఫుల్ గా డ్రగ్స్ సేవించి ఉన్నాడని.. అతని పోస్ట్ మార్టం రిపోర్టులోనే బయటపడిందట. కానీ ఆ విషయాన్ని పోలీస్ లు మాత్రం బయటపెట్టలేదంటున్నారు. ఇక భరత్ చనిపోయినప్పుడు ఒక రాత్రంతా భరత్ కోసం ఎవ్వరూ వెళ్లకపోయేసరికి పోలీస్ లు భరత్ ఫోన్ ని మిగతావాటిని స్వాధీనం చేసుకుని అతని డెడ్ బాడీ ని ఉస్మానియాకు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక కేవలం భరత్ రోడ్ ప్రమాదంలో చనిపోయాడని మాత్రమే పోలీసులు వెల్లడించారు.
అయితే పోలీసులు భరత్ ఫోన్ స్వాధీనం చేసుకున్నప్పుడు అతని ఫోన్ లో డ్రగ్ డీలర్ కెల్విన్ నెంబర్ దొరకడంతో పోలీస్ లు డ్రగ్ మాఫియా డొంక కదిలించడానికే భరత్ డ్రగ్స్ తీసుకుని చనిపోయినట్టు వెల్లడించలేదని తెలుస్తుంది. అలాగే రవితేజ కి ఈ డ్రగ్ మాఫియాతో సంబంధం ఉండబట్టే తమ్ముడు మరణించినా అతని బాడీని చూడడానికి రాకుండా సైలెంట్ అయ్యాడనే వాదన తెరమీదకొచ్చింది. అందుకే రవితేజ అప్పుడు ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడని అంటున్నారు. ఇక భరత్ సెల్ నుండి కెల్విన్ నెంబర్ సంపాదించిన పోలీస్ లు అదను చూసుకుని డ్రగ్ డీలర్ కెల్విన్ అరెస్ట్ చెయ్యడంతో టాలీవుడ్ డ్రగ్ పుట్ట కదిలిందని తెలుస్తుంది.
ఇక కెల్విన్ ఫోన్ వాట్స్ అప్ లో డ్రగ్ మాఫియాకి సంబందించి ఒక గ్రూప్ ఉన్నట్లు పోలీస్ లు గుర్తించడంతో ఇప్పుడు టాలీవుడ్ అతలాకుతలం అవ్వడమే కాదు.... డ్రగ్ తో సంబందాలున్నవారందరికి ఇప్పుడు చమట్లు పట్టడమే కాదు... పేర్లు బయటపడితే కెరీర్ లు నాశనమవుతాయనే దడ పట్టుకుంది. ఇప్పటికే 12 మంది పేర్లు బయటికి వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంకెంతమంది పేర్లు బయటికి వస్తాయో అని హడలి చేస్తున్నారు కొందరు.