Advertisement
Google Ads BL

ఈసారి మహేష్ కూతురిని టార్గెట్‌ చేస్తున్నాడు!


సాధారణంగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజైన మే 31 అంటే మంచి సెంటిమెంట్‌. ఆ రోజున తన కొత్త చిత్రానికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం ఆయన నిర్వహిస్తాడు. దాంతో ఈ ఏడాది కూడా ఒక రోజు ముందే 'స్పైడర్‌'లోని బుల్లి టీజర్‌ని విడుదల చేశాడు. కానీ ఇది సినిమాలో ఉండే సీన్‌ కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఇక సినిమా మొదలై ఏడాది గడుస్తున్నా ఏదో టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, సినిమాలో లేని టీజర్‌తో కానిచ్చేశారు. ఇక విడుదల కూడా సంక్రాంతి, వేసవి, దసరా అంటూ పెంచుకుంటూ పోతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా మహేష్‌ ఇప్పుడు గేర్‌ మార్చి రూట్‌ మార్చాడు. తన గారాల కూతురు సితార పుట్టిన రోజు ఈనెల 20వ తేదీ. ఇటీవల ఈ పాప సినిమా షూటింగ్‌ సెట్‌కి కూడా వచ్చి హడావుడి చేసింది. దీంతో '1'(నేనొక్కడినే)లో తన కుమారుడు గౌతమ్‌కృష్ణని పరిచయం చేసిన మహేష్‌ ఈ 'స్పైడర్‌'లో కూతురు సితారను వెండితెరపై తళ్లుకున్న మెరిసేలా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దానిపై క్లారిటీ లేదు. ఇక తన సితార పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన సినిమాలోని సీన్స్‌తోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు, ఆగష్టు 9న తన పుట్టిన రోజు కానుకగా థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ జరగనుంది. 

ఆగష్టు చివరి వారంలో పాటలను తెలుగు, తమిళం, హిందీ ఇలా విడివిడిగా సెప్టెంబర్‌ మొదటి వారం వరకు జరుపుతారని సమాచారం. సెప్టెంబర్‌ మొత్తం సినిమాని ప్రమోట్‌ చేస్తారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ ప్రమోషన్లు కూడా హైదరాబాద్‌, చెన్నై, ముంబైల వేదికగా చేస్తారట. ఇక అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయడం దాదాపు కన్‌ఫర్మ్‌ అయిందని యూనిట్‌ అంటోంది. 

Spyder Movie Teaser Release Mahesh Daughter Birthday:

Mahesh Babu-Director Murugadoss Combination movie 'Spyder' this movie teaser release mahesh babu daughter sitara Birthday 20th this month and Theatrical trailer release on mahesh birthday 9th august.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs