టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, వారసులు మాత్రమే స్ధిరంగా ఉంటారు. ఇక హీరోయిన్ల నుంచి సంగీత దర్శకులు,సింగర్స్, సపోర్టింగ్ నటులు, విలన్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. చంటి గాడు లోకల్ అన్నట్లుగా, వారసులు,స్టార్స్ మాత్రమే మేమే లోకం అని షష్టిపూర్తి వయసు వచ్చినా మనవరాళ్ల వయసుండే కొత్త హీరోయిన్లను వెతుకుతూ శృంగారాన్ని అంటే రొమాన్స్‌ని, చిందులు వేసి ఆటాడుకుంటూ ఉంటారు.
ఇక గాయనీ గాయకుల విషయంలో ఒకసారి ఉషా, మరోసారి సునీత, మరోసారి మాల్గాడి శుభ, వాణీజయరాం. అద్నామ్‌స్వామి, సుఖ్విందర్, బాబా సైగల్.. ఉదిత్ నారాయణ్.. ఇలా మారిపోతూ ఉంటారు. ఇక బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రంలో టైటిల్ సాంగ్‌కి తన గాత్రంతో ఉర్రూతలూగించిన సింగర్ బ్రిజేష్ శాండిల్య. ఈ పాట బన్నీ అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఆయనకు మరో మంచి అవకాశం వచ్చింది.
మహేష్ బాబు -మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్' చిత్రానికి తమిళ అగ్ర సంగీత దర్శకుడు హైరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో మహేష్‌కి హరీస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన 'సైనికుడు'డిజాస్టర్. అయినా కూడా 'స్పైడర్' చిత్రం ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానుండటం, తమిళంలో ఇది మహేష్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ మూవీ కావడంతో హరీస్ కూడా కొత్తదనంతో ఆకట్టుకోవాలని చూస్తున్నాడు.
బహుభాషా చిత్రాలు తెలుగులో కూడా ఎక్కువవుతున్న సమయంలో మరలా తాను బిజీగా మారడానికి ఇదే మంచి చాన్స్ అని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ చిత్రం పాటల రికార్డింగ్‌తో పాటు అన్ని పాటల చిత్రీకరణ పూర్తయింది. ఇక ఒక్కపాట బ్యాలెన్స్ ఉంది. దీనిని ఆగష్టు మొదటి వారంలో విదేశాలలో చిత్రీకరించనున్నారు దీనికోసం ఓ ఫాస్ట్‌బీట్ సాంగ్‌ని, అదిరిపోయే రేంజ్‌లో హరీస్ రెడీ చేశాడు.
ఇక ఏముంది..? వెతికి వెతికి బ్రిజేష్‌ని ఏకంగా హైదరాబాద్‌లోనే మకాం ఉండేలా చేశారు. ఈ పాట గురించి బ్రిజేష్ మాట్లాడుతూ, ఇలాంటి బీట్ ఉన్న పాటను ఇప్పటి వరకు పాడలేదు. వాయిస్‌లో వినిపించే హెచ్చుతగ్గులు, ఇతర విషయాలు ఇందులో డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక నేను మహేష్ కోసం పాడటం ఇదే మొదటి సారి, ఎంతో హ్యాపీగా ఉంది.. అని అంటున్నాడు. ఇక ఈ పాటకు లిరిక్ రాసిన రామ జోగయ్య శాస్త్రి ఈ పాట కోసం బ్రిజేష్‌ని రికమెండ్ చేశాడట.
మొత్తానికి ఈ పాటను తెలుగుతో పాటు తమిళం, హిందీలలో కూడా ఆయనే పాడుతున్నాడు. ఈ పాట బీట్,బ్రిజేష్ పాడిన తీరు చూసి, వింటే మహేష్ ఫ్యాన్స్‌కే కాదు.. ఊర మాస్ ప్రేక్షకులందరి రోమాలు నిక్కబొడుచుని, ఇది ఆల్బమ్‌లో టాప్ స్థానాన్ని ఆక్రమిస్తుందనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తోంది.