శుక్రవారం ఉదయం ప్రముఖ న్యూస్ పత్రికలో డ్రగ్ కి ఎడిట్ అయిన కొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ వీరే అంటూ న్యూస్ రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అతలాకులతలం అయ్యింది. ప్రముఖ హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్, కేరెక్టర్ ఆర్టిస్టులతో చాలామంది డ్రగ్ కి బానిసలయ్యారంటూ వారికి సిట్ నోటీసులు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు రావడం సంచలనం అయ్యింది. అయితే వారిలో రవితేజ, ఛార్మి, పూరి, సుబ్బరాజు, నవదీప్, నందు, శ్రీనివాస్ రావు, ముమైత్ ఖాన్, చిన్న వంటి పేర్లు బయటికి రావడంతో ఒక్కొక్కరిగా వారు తమకి డ్రగ్స్ కి సంబంధం లేదంటూ తమకెలాంటి నోటీసులు రాలేందంటూ మీడియాకెక్కారు. కొందరు మాకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే కానీ.... మేము డ్రగ్స్ కి బానిసలం కాదు అది సిట్ ముందే క్లారిటీ ఇస్తామంటున్నారు.
ముందుగా ఆర్ట్ డైరెక్టర్ చిన్న నాకు డ్రగ్స్ అలవాటే లేదు. అవి ఎలా వుంటాయో తెలియదు. అసలు సిగరెట్ కూడా కాల్చడం రాదు అంటున్నాడు. నాకు ఏ నోటీసు అందలేదంటున్నాడు. అలాగే ఈ న్యూస్ వలన తన కుటుంబం డిస్ట్రబ్ అవుతుందంటున్నాడు .
ఇక చిన్న హీరో నందు కూడా తనకి ఎలాంటి నోటీసు అందలేదని.... తనకి ఈ కేసుకుకి సంబంధం లేదంటూ మీడియాకి క్లారిటీ ఇచ్చాడు. తనని అంతలా దిగజారాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇక ఈ కేసులో తన పేరుని ఎందుకు బయటపెట్టారో తెలియదు కానీ తన కెరీర్ నాశనమవుతుందంటున్నాడు. డ్రగ్స్ విషయంలో ఎటువంటి పరీక్షకైనా సిద్ధమని ప్రకటించాడు.
మరో హీరో నవదీప్ కూడా తనకి సిట్ నోటీసులు అందాయని కానీ తనకు డ్రగ్స్ కి ఏం సంబంధం లేదని అదే విషయాన్ని అధికారుల ముందు హాజరై క్లారిఫై చేస్తానంటున్నాడు. అలాగే ఆ కెల్విన్ ఎవరో తనకి తెలియదని... ఒక ఈవెంట్ లో తన ఫోన్ నెంబర్ కెల్విన్ ఫోన్ నెంబర్ కి షేర్ అయ్యుండొచ్చనే అనుమానం వ్యక్తం చేసాడు.
ఇక కేరెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు ఈ విషయమై స్పందిస్తూ తన పేరు ఎలా బయటికి అవచ్చిందో అర్ధం కావడంలేదని.... డ్రగ్ రాకెట్ తో సంబంధం లేకుండా ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నాడు. ఇక నోటీసు తనకి అందినది అని ఆ విషయంలో అధికారుల ముందు హాజరవుతానని చెబుతున్నాడు.
ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడం బాధాకరమని యువ హీరో తనీష్ అన్నాడు. ఇటువంటి వార్తలు తన కెరీర్ పై ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేసాడు.
మరి ఇంతమంది లైన్లోకొచ్చి స్పందిస్తుంటే మిగతా వారు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారని ప్రచారం మొదలైంది . అయితే మరోపక్క అధికారులు సెలబ్రిటీస్ కి నోటీసులు పంపించాం గాని వారు తప్పు చేశారని చెప్పలేదని చెబుతున్నారు.
అయితే కేవలం కొన్ని పేర్లే బయటపెట్టి మరికొంతమంది టాప్ సెలబ్రిటీస్ పేర్లు బయటికి రాకుండా పోలీస్ లు గోప్యత పాటిస్తున్నారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.