Advertisement
Google Ads BL

ఉయ్యాలవాడలో కన్నడ స్టార్ హీరో..!


మెగాస్టార్ చిరు 151  మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ఆగష్టు 15 న లాంచ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ ఈ మేరకు ప్రయాత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు రామ్  చరణ్. అయితే ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతారను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం చిత్ర యూనిట్ వేటలో ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఇపుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు ఉపేంద్రను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఉపేంద్ర ఉయ్యాలవాడలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాడో అనే క్యూరియాసిటీ మెగా ఫాన్స్ లో పెరిగిపోతుంది. అయితే చిత్ర యూనిట్ ఉపేంద్ర ని సంప్రదించారని చెబుతున్నారు కాని ఇంకా ఉపేంద్ర ఉయ్యాలవాడలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది క్లారిటీ లేదు. 

కాకపోతే ఉపేంద్ర కన్నడలో హీరోగా చేస్తూనే ఇటు తెలుగులో కూడా విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి కోసం అప్పట్లో త్రివిక్రమ్, ఉపేంద్ర ని తీసుకొచ్చాడు. ఆ సినిమాలో ఉపేంద్ర అధితమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 

Upendra's Key Role in Uyyalawada Narasimhareddy?:

Latest reports suggest that Upendra has been approached by team Uyyalawada Narasimhareddy for a crucial role in the movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs