Advertisement
Google Ads BL

పవన్ లాగానే ఆదరగొడుతున్నాడు...!


చిన్నప్పటి నుంచి తాను పవన్‌ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనే తనకు దేవుడని నితిన్‌ చెబుతుంటాడు. తన సినిమా టైటిల్స్‌ నుంచి బాడీలాంగ్వేజ్‌, డైలాగ్‌డెలివరి, పాటల రీమిక్స్‌, పవన్‌లాగా కనిపించే ప్రయత్నాలు చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటాడు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడక పోగా, గర్వంగా చెప్పుకుంటాడు. ఇక ఆయనను తన వేడుకలన్నింటికి ఆహ్వానిస్తాడు. 

Advertisement
CJ Advs

పవన్‌ కూడా ఎక్కడికి హాజరైనా కాకపోయిన వీలుంటే ఆయన వేడులకు ఖచ్చితంగా వస్తూ ఉంటాడు. ఇక తాజాగా నితిన్‌ హను రాఘవపూడి డైరెక్షన్‌లో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌లో 'లై' (అబద్దం) చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బాడీ లాంగ్వేజ్‌, లుక్‌, గుబురుగడ్డం, గూగుల్స్‌ చూస్తూంటే 'పంజా'లోని పవన్‌ గుర్తుకొస్తాడు. ఇక ఇదే చిత్రంలో నితిన్‌ పవన్‌ 'తమ్ముడు' చిత్రంలోని 'వయ్యారిభామ నీ హంసనడక' పాటలో టైప్‌లో లుంగీ పైకి కట్టుకుని కనిపిస్తున్నాడు. 

తాజాగా విడుదలైన టీజర్‌ స్టన్నింగ్‌గా ఉంది. ఇక ఈ చిత్రం టీజర్‌ కేవలం తెలుగువారినే కాకుండా బాలీవుడ్‌ క్రిటిక్‌ తరుణ్‌ ఆదర్శ్‌ దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన ట్వీట్‌ చేస్తూ మీ కంటిని, దృష్టిని ఆకర్షించే 'లై' ఇదిగో అని ట్వీట్‌ చేశాడు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయిందనే చెప్పాలి, మేఘాఆకాష్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రం ఆగష్టు11న విడుదల కానుంది. 

Taran Adarsh Posted Lie Movie Teaser in Twitter:

Nithiin acted movie 'LIE' Director by Hanu Raghavapudi. This Movie release on 11th august 2017 and recently released movie teaser this teaser attractive bollywood critic Taran Adarsh.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs