Advertisement
Google Ads BL

అనిరుధ్ ని ఈసారి నమ్మొచ్చు..!


ప్రస్తుతం సౌతిండియన్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అంటే అందరు అనిరుధ్ రవిచంద్రన్‌ పేరునే చెబుతారు. ఆయన ధనుష్‌ నటించి, పాడిన 'వై దిస్‌ కొలవరి.. కొలవరిడి' పాట దేశాన్నే ఓ ఊపు ఊపింది. కానీ ఈ కుర్రాడికి అసలు సంగీతం మీదకంటే మిగిలిన జల్సాలపై మోజెక్కువ అంటారు. సుచి లీక్స్‌లో ఈయన కూడా ఒకడు అనే సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య శింబు పాడిన వివాదాస్పదమైన, మహిళలను కించిపరిచేలా ఉన్న ఆల్బమ్‌కి సంగీతం అందించి మరోసారి వార్తల్లో నిలిచాడు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన అజిత్‌-శివల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ 'వివేగం'లోని 'సూరియా... సూరియా..' సాంగ్‌ అదరగొడుతోంది. కాగా గతంలోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'బ్రూస్‌లీ'లో అవకాశం వచ్చింది, కానీ జారవిడుచుకున్నాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-నితిన్‌-సమంతల కాంబినేషన్‌లో వచ్చిన 'అ..ఆ' కు ఒప్పుకుని మరీ షూటింగ్‌ సగం పూర్తయ్యాక తనకు తమిళ సినిమాలలో బిజీగా మారానని, కాబట్టి ఆ చిత్రం చేయలేనని తప్పుకున్నాడు. ఇక అజిత్‌-శివల హ్యాట్రిక్‌ సంచలన మూవీ 'వివేగం' మాదిరిగానే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అంచనాలున్న హ్యాట్రిక్‌ చిత్రానికి ఎంపికయ్యాడు. 

కానీ ఏ రోజున ఏం చెబుతాడో? ఏ రోజున ఏవో కారణాలు చెప్పి మూవీ నుంచి తప్పుకుంటాడో అని అందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలోని ఒక రొమాంటిక్‌ సాంగ్‌ మినహా మిగిలిన పాటలన్నీ పూర్తి చేసి, దర్శకుని చేతిలో పెట్టాడట. త్వరలోనే ఆ పాటను కూడా పూర్తి చేసి, ఆర్‌.ఆర్‌పై దృష్టిపెట్టనున్నాడు. మొత్తానికి ఇది పవన్‌ అభిమానులకు ఆనందాన్నిచ్చే సంగతే....! 

Anirudh Music to Pawan and Trivikram Film:

Anirudh music Updates on Pawan and Trivikram Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs