Advertisement
Google Ads BL

'బాహుబలి'కి కలసి రాని జోనర్‌లో రానుందట..!


'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రభాస్‌ హీరోగా నటించే చిత్రం 'సాహో'. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌పై రోజుకో వార్త వస్తోంది.ఇక సంగీత దర్శకులుగా శంకర్‌-ఎహాసాన్‌-లాయ్‌లు పనిచేస్తున్నారు. ఇక 'బాహుబలి' చిత్రం విషయానికి వస్తే కామెడీకి ఏమాత్రం అవకాశం లేని ఎమోషనల్‌ అండ్‌ పీక్‌ హిరోయిజం ఉన్న మూవీ. 

Advertisement
CJ Advs

కాగా సుజీత్‌ మాత్రం తన తొలి చిత్రాన్ని యువి క్రియేషన్స్‌లోనే శర్వానంద్‌ హీరోగా నటించిన 'రన్‌ రాజా రన్‌'ను మంచి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్ది హిట్‌ కొట్టాడు. ఆయనకు కామెడీని బాగా హ్యాండిల్‌ చేశాడనే పేరు కూడా వచ్చింది.ఇక ఆయన ప్రభాస్‌తో చేయబోయే 'సాహో' చిత్రాన్ని పూర్తి యాక్షన్‌ మూవీగానే కాదు... ఫ్యామిలీ సెంటిమెంట్‌, బంధాలు, అనుబంధాలు, కామెడీతో స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. 

గతంలో ప్రభాస్‌ పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో చేసిన 'బుజ్జిగాడు మేడిన్‌ చెన్నై, ఏక్‌ నిరంజన్‌తో పాటు పౌర్ణమి కూడా బాగా ఆడలేదు. కానీ డార్లింగ్‌లో మాత్రం ప్రభాస్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించి, తనకు తాను డార్లింగ్‌నే ఊతపదంగా మార్చుకున్నాడు. మరి 'సాహో' విషయంలో ప్రభాస్‌-సుజీత్‌లు ఏమాయ చేస్తారో చూడాల్సివుంది..! 

Saaho to Have Top Notch Action Sequences:

'The director Sujeeth has a special vision on the film and a terrific action choreography has been planned for the film'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs