Advertisement
Google Ads BL

'శమంతకమణి'కి బాలయ్య హామీ...!


రేపు నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది సాయికుమార్‌ వంటి నలుగురు యంగ్‌హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం 'శమంతకమణి' విడుదలవుతోంది. ఈ చిత్ర విజయంపై నలుగురు హీరోలతో పాటు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య, సినిమాను నిర్మించిన 'భవ్య ఆర్ట్స్‌ అధినేత' ఆనంద్‌ ప్రసాద్‌లు ఎంతో నమ్మకంతో ఉన్నారు. పూర్తిగా కమర్షియల్‌ మూవీ కాకపోవడం, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే,కొత్తతరహా కథగా వస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్న నలుగురిలో ఎవ్వరికీ స్టార్‌ హోదా లేదు. 

Advertisement
CJ Advs

వారు కేవలం మామూలు హీరోలే. కాకపోతే నలుగురికి మంచి భవిష్యత్తు ఉన్న హీరోలుగా గుర్తింపు ఉంది. ఇక ఈ చిత్రం బిజినెస్‌లో కూడా నలుగురు హీరోలకు, రాజేంద్ర ప్రసాద్‌కి ఒంటిచేత్తో సినిమాకు ఓపెనింగ్స్‌ తెచ్చే సత్తా గానీ, ఒంటిచేత్తో రచ్చ చేయగలిగిన సత్తా లేకపోవడంతో సినిమా బిజినెస్‌ విషయంలో కొంత తక్కువ రేటుకు బయ్యర్లు అడిగారట. 

కానీ తక్కువ రేటుకు ఇచ్చే సమస్యేలేదని, తమకి సబ్జెక్ట్‌పై పూర్తి నమ్మకం ఉండటంతో ఈ చిత్రాన్నితాము చెప్పిన రేటుకే కొనాలని , తేడా ఏమాత్రం రాదని, పోనీ వస్తే తాము పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 101వ చిత్రంగా వస్తున్న 'పైసా వసూల్‌'ని ఈసినిమాకి హామీగా ఉంచుతామని నిర్మాత స్పష్టం చేశాకే.. ఈ చిత్రం బిజినెస్‌ అనుకున్న స్థాయిలో జరుగింందని సమాచారం. మొత్తానికి 'శమంతకమణి' హిట్టయితే భవిష్యత్తులో మరికొందరు యువహీరోలు ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఓకే చెప్పే అవకాశం ఉంది. 

Shamanthakamani Should Score a Hit for Paisa Vasool:

Shamanthakamani which starrer Sundeep Kishan, Nara Rohit, Aadi and Sudheer Babu. Shamanthakamani is hitting screens tomorrow across the globe. If at all SM scores a hit, it would become a big boost for Paisa Vasool's pre release business.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs