Advertisement
Google Ads BL

నాడు తాత..నేడు మనవడు..!


నాటి సీనియర్‌ ఎన్టీఆర్‌ తన చిత్రాలలో విలన్‌ చాయలుండే పౌరాణిక పాత్రను హీరోలుగా మలిచి, వారి యాంగిల్‌లో కథను నడిపిస్తూ అదరగొట్టాడు. 'భూకైలాస్‌'లో రావణబ్రహ్మగా, 'దాన వీర శూర కర్ణ'లో ధుర్యోధనునిగా, కర్ణుడుగా ప్రతి చాయలనున్న పాత్రలను పోషించి మెప్పించాడు. ఇక ధుర్యోదనునిలోని నెగటివ్‌ కోణాన్ని పాజిటివ్‌గా చూపిస్తూనతో డ్యూయెట్‌ పాడించి, నృత్యం చేయించి ఆయనలోని శృంగార పురుషుడిని ఆవిష్కరించాడు. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం ఆయన మనవడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ 'జై లవకుశ'లో విలన్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'జై' పాత్ర నెగటివ్‌ షేడ్స్‌లో సాగుతూ, రావణాసురుని భక్తునిగా కనిపిస్తుంది. కాగా ఎన్టీఆర్‌ వరుస ఫ్లాప్‌లలో ఉన్న సమయంలో పూరీ జగన్నాథ్‌ చిత్రం 'టెంపర్‌'లో కూడా దాదాపు సగం చిత్రం వరకు ఆయన నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనే చేసి మెప్పించాడు. అందులో తాను పోషించిన నెగటివ్‌ పాత్ర ఉన్నంత సేపు ఆయన నటనలో అదరగొట్టడం, ఆ దయా పాత్రకు మంచి స్పందన రావడమే 'జై లవ కుశ'లో నెగటివ్‌ పాత్రను చేయడానికి స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. 

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకుడని తెలిసి మొదట్లో దీనిని ఎవరూ పట్టించుకోలేదు.కానీ 'జై' పాత్ర టీజర్‌ విడుదలై కాస్త నత్తిగా ద..ద... ధైర్యంగా అందరినీ మెప్పించడంతో ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి. 

Jr NTR Negetive Role in Jai Lava Kusa Movie:

Jr NTR acted movie Jai Lava Kusa this movie director Bobby and producer Nandamuri Kalyan Ram. NTR negetive role in this movie name by Jai. Recently released Jai teaser very good respons to audiance.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs