Advertisement
Google Ads BL

పవన్ తో అవకాశం అందుకే వదులుకుందట!


'జంటిల్మన్' సినిమాలో నానికి జోడిగా నటించిన నివేత థామస్ ఇప్పుడు మళ్ళి నానితోనే 'నిన్ను కోరి' చిత్రంలో నటించింది. ఆ చిత్రం గత శుక్రవారమే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. వరుసగా రెండు హిట్స్ తో దూసుకుపోతున్న నివేత థామస్ ఇప్పుడు స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన 'జై లవ కుశ'లో నటిస్తుంది. అందం, అణుకువ, నటనలో మంచి ప్రావీణ్యంతో దూసుకుపోతున్న నివేత థామస్ టాలీవుడ్ ఒక స్టార్ హీరో సినిమాలో చెయ్యనని చెప్పిందని న్యూస్ ఆ మధ్యన హాట్ టాపిక్ అయ్యింది..

Advertisement
CJ Advs

మరి ఆ స్టార్ హీరో అలాంటి ఇలాంటి హీరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నివేత ఛాన్స్ వదులుకుందట. ఆ విషయాన్నే నివేత థామస్ ని అడగగా..  నిజంగానే పవన్ సినిమాలో అవకాశం వదులుకున్నట్టు చెప్పింది. పవన్ సినిమాలో తనకి అవకాశం వచ్చినమాట నిజమే అని కానీ పవన్ చెల్లెలిగా అవకాశం రావడంతో తిరస్కరించానని చెబుతుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా కెరీర్ లో ఎదుగుతున్న నాకు చెల్లెలి కేరెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే ఆ ఆఫర్ వద్దనుకున్నా అని అంటుంది.

ఇక పవన్ సినిమాలో నటించనని చెప్పినందుకు ఎంతగానో బాధ పడ్డా అని... ఆయన సినిమాలో కొద్దిసేపు కనిపించే రోల్ వచ్చినా ఈసారి వదులుకోనని చెబుతుంది. అలాగే తనకి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చెయ్యాలని ఉందని కూడా తెలిపింది. అయితే ఇప్పుడే కాదట.. రెండు మూడేళ్లు తర్వాత ఆ పని చేస్తానని చెబుతుంది ఈ హిట్టు భామ. 

Nivetha Thomas About Pawan Kalyan Movie Chance:

Reason Behind the Nivetha Thomas Rejected the Pawan Kalyan Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs