బాలీవుడ్ లో సల్మాన్ హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ షో అక్కడ సెన్సేషనల్ హిట్టయ్యింది. మరి అలా హిట్టయిన ఆ షోని సౌత్ లో కూడా దించాలని ప్లాన్ చేసి కోలీవుడ్ లో బిగ్ స్టార్ అయిన కమల్ హాసన్ హోస్టుగా.... టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ షోని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో కమల్ హోస్ట్ గా ఈ షో స్టార్ట్ అవడము ప్లాప్ టాక్ తెచ్చుకోవడము జరిగిపోయింది. అక్కడ గొప్ప పార్టిసిపేట్స్ లేకపోవడం వల్లనే ఆ షోకి మొదటి ఎపిసోడ్ కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి కోలీవుడ్ లో ఎంతో క్రేజ్ తో ప్రారంభమైన ఈ షో అక్కడ తుస్ మంది. అంతేకాకుండా కమల్ బిగ్ బాస్ షో అక్కడ టీవీలో చాల తక్కువ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది.
అయితే తాజాగా కోలీవుడ్ లో ఇప్పుడు బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది. ఈ షోని నిలిపి వేయాలని.... ఆ షోకి హోస్ట్ గా చేస్తున్న కమల్ హాసన్ ని అరెస్ట్ చేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడాడని.. అలాంటి వ్యక్తితో ఇలా టీవీ షో చేయించడం ఏమిటంటూ వారు నిలదీస్తున్నారు. మరి కోలీవుడ్ లో కాంట్రవర్సీ ఎదుర్కుంటున్న ఈ షో ఇక్కడ తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుందో... అంటూ అనుమానాలు మొదలయ్యాయి.
ఇక్కడ తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా చెయ్యడంతో ఈ షోకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. కానీ పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. మరి ఎన్టీఆర్ క్రేజ్ ఈ బిగ్ బాస్ షో కి ఎంత హెల్ప్ చేస్తుందో తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఈ షో రన్ అవ్వాలని స్టార్ మా యాజమాన్యం కోరుకుంటుందట. అయితే ఈ షోలో పార్టిసిపేట్స్ 70 రోజుల పాటు ఓకే ఇంట్లో ఎలా వుంటారో. వారు కొట్టుకోవడం, తిట్టుకోవడంలాంటివి చేస్తే తెలుగు మేధావులు ఈ షో మీద ఎలాంటి కాంట్రవర్సీలు లేవదీస్తారో అనేది మాత్రం ఇపుడు బిగ్ సస్పెన్సు గా మారింది. ఎలాగైనా ఎన్టీఆర్ ఈ షోని ఒంటి చేత్తో నడిపించడం అంత ఈజీకాదనే మాట మాత్రం బలంగా వినబడుతుంది.