Advertisement
Google Ads BL

నానిని ఎవ్వరూ వదలడం లేదు..!


నేచురల్‌స్టార్‌ నాని నటించిన ఏ చిత్రం విడుదలైనా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది. తనదైన నటన, టైమింగ్‌లతో ఆయన తనదైన శైలిలో పాత్రల్లో జీవిస్తుంటాడు. దాంతో అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా విడుదలైన 'నిన్నుకోరి'తో సక్సెస్‌పరంగా, కలెక్షన్ల పరంగానే కాదు.. నటనా పరంగా కూడా నాని మరో మెట్టు పైకెక్కాడు. ప్రేక్షకుల కంట కన్నీరు కార్పిస్తూనే తనదైన నటనతో ఎంటర్‌టైన్‌ చేశాడు. దీంతో ఆందరూ ఆయన నటనకు ఫిదా అయిపోతున్నారు. 

Advertisement
CJ Advs

ఇటీవలే తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ ఈ చిత్రాన్ని, అందులోని నాని నటనను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌'లతో సంచలనాలను క్రియేట్‌ చేసిన కొరటాల శివ నానిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ చిత్రంలో నాని నటన అద్భుతమని, సినిమాలోని ప్రతిక్షణాన్ని తాను ఆస్వాదించానని చెప్పాడు. ఇక నాని నటన కూడా అద్భుతమని చెబుతూ, దర్శకుడు శివనిర్వాణ, నిర్మాతలు దానయ్య, రచయిత, నిర్మాణ భాగస్వామి కోనవెంకట్‌లకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక ఈ చిత్రంలో నివేధా ధామస్‌ నటన అద్భుతమని, ఇక రచయితలు ఆమెను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాసే విధంగా ఆమె నటన ఉందన్నాడు. ఇలా సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, మంత్రులు కూడా నాని నటనకు ఫిదా అయిపోతుంటే నాని టాప్‌స్టార్‌ కావడానికి ఎంతో సమయం పట్టదని అనిపిస్తోంది. 

Koratala Siva Praises Nani and Ninnu Kori Team:

After KTR, Director Koratala Siva Praises Hero Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs