Advertisement
Google Ads BL

బోయపాటి చాలా జాగ్రత్తపడ్డాడు...!


బోయపాటి శ్రీను అంటే ఊరమాస్‌కి, యాక్షన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. కాగా ఆయన ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాణంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా, స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా, ప్రగ్యాజైస్వాల్‌తో పాటు కేథరిన్‌ ఐటం సాంగ్‌ చేస్తున్న చిత్రం 'జయ జానకి నాయక'. ఈ చిత్రం ఆగష్టు11న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్‌ సహా ఫస్ట్‌లుక్‌ కూడా రొమాంటిక్‌గా, ఫ్రెష్‌ లవ్‌స్టోరీ అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలు చేసే బోయపాటి ఇలాంటి చిత్రాన్ని చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఈ చిత్రం లవ్లీ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ ఆయన మార్క్‌ ఎమోషన్స్‌, యాక్షన్‌ కూడా ఉంటాయని ఇటీవల విడుదలైన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ లుక్‌తో కూడినపోస్టర్‌ని చూస్తే అర్దమవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం మొదలైనప్పటికీ ఇప్పటివరకు అంచనాలు లేకుండా, కామ్‌గా ఉన్న ఈ చిత్రానికి అనుకోకుండా భారీ అంచనాలు, పాజిటివ్‌బజ్‌ వచ్చాయి. కాగా ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్‌ టీజర్‌లో తనదైన మాస్‌ ఛాయలు కనిపించకుండా మొత్తం హోమ్లీగా, లవ్లీగా ఉండేలా బోయపాటి టీజర్‌ని కట్‌ చేశాడు. రొటీన్‌ అనే మాటను పక్కనపెట్టి తనలోని మరోకోణాన్ని ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరించిందనే చెప్పాలి. టీజర్‌ కూడా టైటిల్‌లాగానే క్లాస్‌టచ్‌తో ఉంది. ఇక రాబోయే టీజర్లు, ట్రైలర్స్‌తో పాటు,... ఎవ్వరూ ఊహించని విధంగా బోయపాటి ఇందులో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Boyapati Jaya Janaki Nayaka Teaser Released:

Jaya Janaki Nayaka starring Bellamkonda Sreenivas and Rakul Preet Singh in lead roles is helmed by sensational director Boyapati Sreenu for producer M Ravinder Reddy of Dwaraka Creations banner. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs