Advertisement
Google Ads BL

చందమామకు అరుదైన అవకాశం..!


తమిళ సీనియర్‌ దర్శకుడు పి.వాసు గురించి ప్రత్యేకంగా చెప్పన వరసం లేదు. తమిళంలోని అందరు స్టార్స్‌తో పాటు బాలకృష్ణతో కూడా ఆయన చిత్రం తీశాడు. ఇక ఆయన కాన్సెప్ట్‌ మూవీస్‌ని తీస్తూన తనదైన కమర్షియల్‌ హంగులు అద్దడంలో దిట్ట. ఈ విషయం 'చంద్రముఖి' చూసిన వారికి అర్దమవుతుంది. లీడ్‌రోల్‌ జ్యోతికదే అయినా రజనీకాంత్‌, ప్రభు, నయనతారలను ఆయన చూపించిన విధానం అద్బుతం.

Advertisement
CJ Advs

కాగా ఆయన ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ మూవీని తీయాలని భావిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీలలో కూడా రిలీజ్‌చేసే ఉద్దేశ్యం ఉండటంతో మన చందమామ కాజల్‌ని కలసి స్టోరీలైన్‌ వినిపించాడట. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ ఇప్పుడే లేడీ ఓరియంటెడ్‌ మూవీలలో చేస్తే తాను ఫేడవుట్‌ అయ్యానని అందరూ అనుకునే ప్రమాదం ఉందనే ఆలోచనలో కాజల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ల పరిస్థితి వేరైనా టాలీవుడ్‌లో మాత్రం హీరోయిన్లు ఫేడవుట్‌ అయ్యే సమయాలలోనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తారనే అపోహ ఉంది.తమిళంలో నయనతారలాగా, లేదా బాలీవుడ్‌లో కంగనా రౌనత్‌, విద్యాబాలన్‌, ఐశ్వర్యారాయ్‌ వంటి వారు కూడా మంచిపీక్‌లో ఉన్నప్పుడే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేసి మెప్పించారు. 

వాస్తవానికి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో అవకాశం రావడమంటే తమ నటనను దక్కిన గౌరవంగా భావించాల్సింది పోయి... ఇలా చెడ్డగా చూడటం ఎందుకో...? గతంలో శారద, విజయశాంతి,నేటి అనుష్కలు ఇటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు గ్లామర్‌ పాత్రల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చందమామ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....! 

Kajal Agarwal Treading New Path:

For the first time, Kajal is showing signs of urgency to bag one and has reportedly accepted a heroine based script when senior director P Vasu approached her. This can probably be a big budgeted project as entire film will centre on female lead that is Kajal Agarwal.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs