Advertisement
Google Ads BL

బాలీవుడ్‌ విలన్‌ వెనుక పరుగెడుతున్నారు...!


మన నిన్నటితరం హీరోలైన జగపతిబాబు, సుమన్‌,భానుచందర్‌, అర్జున్‌, శరత్‌కుమార్‌, సత్యరాజ్‌, శ్రీకాంత్‌, జెడి చక్రవర్తి, ఆది పినిశెట్టి, సాయికుమార్‌ నుంచి రాజశేఖర్‌ వరకు ఎందరో మంచి పాత్రలు వస్తే విలన్లుగా నటించడానికి ఓకే చెబుతున్నారు. కానీ మన మేకర్స్‌ మాత్రం వారిని మరిచి, బాలీవుడ్‌ విలన్లపై మోజు చూపుతున్నారు. 'అగ్లీ, కాబిల్‌, సర్కార్‌2' చిత్రాలతో పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు రోహిత్ రాయ్ తెలుగులో విలన్‌గా వరుస చిత్రాలను చేజిక్కించుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే ఆయన ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో బాబి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ తన ఎన్టీఆర్‌ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'జై లవ కుశ'లో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదల కాకుండానే ఆయన అకౌంట్‌లో మరో చిత్రం చేరిందని సమాచారం. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తమిళ చిత్రం 'బోగన్‌'కి రీమేక్‌గా రూపొందనున్న చిత్రంలో రోహిత్ రాయ్ నే విలన్‌గా ఎంచుకున్నారు. 

హ్యాండ్సమ్‌ విలన్‌గా, విలన్‌ పాత్రలకు బాగా సూటయ్యే పర్సనాలిటీ ఉండటంతో ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాత ఈ రోహిత్ రాయ్ తెలుగులో మరింత మార్కెట్‌ను పెంచుకుని, తన ఆఫర్లను వరుసగా తెచ్చుకుంటాడనే నమ్మకాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌, రవితేజలు సూపర్‌ నటులే కాదు.. చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీతో పాటు అద్భుతమైన ఎనర్జీ వారి సొంతం, మరి వారికి దీటుగా ఈ రోహిత్ రాయ్ నటిస్తే మాత్రం మిగిలిన స్టార్స్‌కనులలో పడే అవకాశాలు ఈ యంగ్‌ విలన్‌కి బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. 

Bollywood Villain Rohit Roy in Ravi Teja Movie:

Jr NTR acted movie 'Jai Lava Kusa' director by Bobby and producer Kalyan Ram. In this Movie villain role acted bollywood villain Rohit Roy and he is bags one more movie Ravi Teja acting movie tamil remake film 'Bogass'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs