నారా రోహిత్.. వరుసగా చిత్రాలు చేయడమే కాదు.. విభిన్నపాత్రలను ఎంచుకోవడంలో కూడా ఆయనది ఓ డిఫరెంట్‌స్టైల్. కాగా ఆయన తన తొలి చిత్రం 'బాణం'తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయనకు 'బాణం, సావిత్రి, అసుర, జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు' వంటి మంచి చిత్రాలు ఖాతాలో ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఆయన సుదీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్‌లతో మల్టీహీరోలు నటిస్తున్న 'శమంతకమణి' చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రానికి 'భలే మంచిరోజు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే నాలుగు చిత్రాలలో పోలీస్‌గా కనిపించడంతో పోలీస్ పాత్రలంటేనే బోర్ కొట్టేసింది. ఈ కథను విన్న నాగశౌర్య కథ బాగుందని వినాలని నా వద్దకు పంపాడు. ఇది కూడా పోలీస్ పాత్ర అనేసరికి నీరుగారాను. ఏకంగా పోలీస్ డ్రస్ కుట్టించుకోవాలేమో అని భావించాను, కానీ కథ విన్నతర్వాత మాత్రం బాగా నచ్చింది. ఇందులో కారును దొంగతనం చేసిన యువకుల మీద దర్యాప్తు చేసే పోలీస్‌గా కనిపిస్తున్నాను.
ఇందులో నా పాత్ర తర్వాత నాకు సుధీర్‌బాబు పాత్ర నచ్చింది. ఆది సెంటిమెంట్‌తో నిండిన పాత్ర, ఇక నేను ఇప్పటికే 'జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు' వంటి చిత్రాలలో మరో హీరోతో కలిసి నటించాను, ఇక ఈ చిత్రంలోని పాత్ర కోసం నేను బరువు తగ్గలేదు.పవన్ సాధినేని చిత్రం కోసం తగ్గాను. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌లు ఈనెల 25న విడుదలకానున్నాయి. పవన్ సాదినేని చిత్రంతో పాటు 'వీరభోగ వసంతరాయులు', 'కథలో రాజకుమారి' చిత్రాలలో చేస్తున్నాను.
'వీరభోగ వసంతరాయులు' పేరు విని ఇదేదో చారిత్రక చిత్రం అనుకుంటారు. అది తప్పు ఈ చిత్రం హిందీలో 'ది వెడ్నస్‌డే' (తెలుగులో వెంకటేష్, కమల్ హాసన్‌ల 'ఈనాడు') లాగా ఉంటుంది. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది.
ఇక 'శమంతకనమణి'లో నేను చేసే పాత్ర పేరు రంజిత్ కుమార్. ఎన్టీఆర్ నటించిన 'కొండవీటి సింహం', బాలకృష్ణ నటించిన 'రౌడీ ఇన్‌సెక్టర్' చిత్రాలలో కూడా వారి పాత్రల పేర్తు రంజిత్ కుమార్ అని నాకు తెలియదు. ఓ ఫ్రెండ్ మెసేజ్ పెడితే తెలిసింది.. అని చెప్పుకొచ్చారు.....!