Advertisement
Google Ads BL

సాయంత్రానికి సమంతలో ఇంత ఛేంజా..?


నిన్న మంగళవారం ఉదయం సమంత జె ఎఫ్ డబ్ల్యు మ్యాగజైన్ షూట్  కి సంబందించిన హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోస్ లో సమంత బీభత్సమైన హాట్ లుక్స్ తో చంపేసింది . చేనేత బికినీ వేసుకొని నడుంఒంపులతో గిలిగింతలు పెట్టింది. ఇంకేమిటి సమంతని  అలా చూసిన అభిమానులంతా తలొక అభిప్రాయానికి వచ్చేశారు. అయ్యో అక్కినేని ఇంటి కోడలిగా కాలు పెట్టె సమంత ఏమిటి ఇంత అందాలా ఆరబోతకు దిగింది అని కొందరంటే మరికొందరు అమ్మడు పెళ్లికి రెడీ అవుతున్నా అందాలు దాచుకోకుండా ఆరబోస్తుందని కొందరు. అబ్బా సమంత ఎంత సక్సీ గా ఉందొ అంటూ కొందరు కామెంట్స్ పడేశారు. నిన్న ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో సమంత హాట్ లుక్ పిక్స్ ట్రెండింగ్లో వున్నాయి.

Advertisement
CJ Advs

ఇక సాయంత్రానికల్లా సమంత మళ్లీ లంగా ఓణీ తో అచ్చం పల్లెటూరి అమాయకపు అమ్మాయిలా దర్శన మిచ్చింది. అయితే సమంత ఇలా ఓణిలో దర్శన మిచ్చింది రామ చరణ్ తో చేస్తున్న సినిమాకి సంబంధించింది మాత్రం కాదు. ఇదొక తమిళ సినిమాకి సంబందించిన సినిమాలోని పిక్. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక పల్లెటూరు అమ్మాయిగా సమంత  కనిపించనుంది. ఆ సినిమా కోసమే సమంత ఇలా పరికిణి ఓణిలోకి  నేచురల్ బ్యూటీ మాదిరిగా మారిపోయింది. మరి పొద్దున్న సోషల్ మీడియాలో హాట్ హాట్ పెరఫార్మెన్సు తో రెచ్చిపోయిన సమంత సాయాంత్రానికి ఇలా అమాయకపు అమ్మాయిలా మారిపోయిందని అంటున్నారు.

ఇక సమంత ఇదే తరహా పాత్రని రామ చరణ్ - సుకుమార్ 'రంగస్థలం 1985' లోను చేస్తుంది. అందులో కూడా సమంత పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనబడబోతుంది. అలాగే 'మహానటి'లో కూడా సమంత సాంప్రదాయ పద్దతిలోనే కనబడుతుందని కొన్ని లీకయిన పిక్స్ లో అర్ధమవుతుంది. మొత్తానికి సమంత నాలుగు కాలాలు గుర్తుండి పోయే పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నమాట.

Samantha in Langa Voni Look:

By evening, Samantha had a nice girl with a langa voni and looked like an innocent girl.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs