అఖిల్ పెళ్లి, ఎంగేజ్మెంట్ గోల ముగిసిపోయి చాలా కాలమే అయ్యింది. అఖిల్ కి శ్రియ భూపాల్ కి బ్రేకప్ అయిన తర్వాత తన కెరీర్ లో బిజీ అయ్యాడు అఖిల్. రెండో చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మొదలు పెట్టుకుని షూటింగ్ జరుపునుకుంటున్నాడు. అయితే ఇపుడు అఖిల్ పెళ్లి విషయం మరోసారి తెరమీదకొచ్చింది. ఇప్పుడు అఖిల్ పెళ్లి విషయంలో ఒక పెద్ద పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఆ పుకారు అలాంటి ఇలాంటి పుకారు కాదు. మీరే చూడండి. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూతురునిచ్చి అఖిల్ కి పెళ్లి చెయ్యబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అఖిల్ పెళ్లి విషయం ఇదే. అసలు వెంకటేష్ కూతురు అఖిల్ కన్నా పెద్దదట. అయినా కూడా వెంకటేష్ కూతురుకి అఖిల్ కి ముడి పెట్టేసారు సదరు గాసిప్ రాయుళ్లు.
శ్రియ భూపాల్ తో పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు అక్కినేని ఫ్యామిలీ కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి బ్రేకప్అ యిన విషయం ఇంతవరకు నాగార్జున గాని, అమల గాని, అఖిల్ గాని ఎక్కడా ప్రస్తావించలేదు. అలా కొన్ని రోజులు గడిచాక ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. మళ్ళీ ఇప్పుడు అఖిల్ పెళ్లి విషయంలో జరుగుతున్న ప్రచారానికి మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ ఫీలవుతున్నట్టు సమాచారం. అసలు అఖిల్ పెళ్లి విషయం ఇప్పట్లో ఆలోచించే పరిస్థితుల్లో నాగ్ ఫ్యామిలీ లేదట. అటువంటి టైం లో ఇలాంటి వార్తలు నిజంగా ఇబ్బంది పెట్టేస్తాయి కదా..!