Advertisement
Google Ads BL

సమంత అంతా చెప్పేసింది...!


తాను నటించిన తొలి చిత్రం హీరోనే ప్రేమించి, అతని ప్రేమను కూడా పొంది త్వరలో ప్రఖ్యాత అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెడుతున్న సమంత ప్రస్తుతం తన జీవితంలోని మధుర క్షణాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్‌తో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇంకా ఏమైనా అడగాలంటే అడగండని ప్యాన్స్‌ను జోష్‌తో నింపింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఓ అభిమాని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి చెప్పమనడంతో ఆమె మహేష్‌ గురించి చెబుతూ, ఆయన షూటింగ్‌లలో బాగా ఉత్సాహంగా ఉంటారు. ఆయనుంటే సమయమే తెలియదు. సెట్స్‌ అంతా సందడే సందడిగా ఉంటుంది. కానీ అది షూటింగ్‌ బ్రేక్‌ సమయంలోనే. ఆయన తీయబోయే సీన్‌ గురించి, దానిలో చెప్పాల్సిన డైలాగ్స్‌ వంటి విషయాలపై ఆలోచన కేంద్రీకరించినప్పుడు మాత్రం ఆయన్ను డిస్ట్రర్బ్‌ చేస్తే ఇక కోపంతో ఊగిపోతారు. 

నవ్వినా ఒప్పుకోడు. ఆయన పనికి ఆయన కట్టుబడి ఉంటాడు. సినిమాపైనే దృష్టంతా కేంద్రీకరిస్తాడు. ఆయనతో 'దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో పాటు 'బ్రహ్మూెత్సవం'లో కూడా నటించానని చెప్పుకొచ్చింది. ఇక ఆయన కుమార్తె సితారకు సమంత అంటే భలేఇష్టం. ఆమె చేసే సీన్స్‌ని సితార ఇమిటేట్‌ చేస్తూ ఉంటుంది. ఇక తనకు, చైతుకు మద్య వచ్చే కామన్‌ డిస్కషన్స్‌ ఏమిటి? అంటే డిన్నర్‌కి ఏం తిందామనేదే అని చెప్పింది. 

కాగా అక్టోబర్‌ 6వ తేదీని చైతూ-సమంతల పెళ్లి జరగనుంది. ప్రస్తుతం ఆమె 'రాజు గారి గది2', రామ్‌చరణ్‌ 'రంగస్థలం-1985', 'మహానటి'తో పాటు విజయ్‌తో 'మెర్సల్‌', ఇక తాజాగా సోమవారం మొదలైన శివ కార్తికేయన్‌ చిత్రాలలో నటిస్తోంది. 

Samantha Has Said Everything:

Recently Samantha answered Twitter's fans questions. and Samantha told about Superstar Mahesh babu.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs