Advertisement
Google Ads BL

ప్రభాస్‌ రాసిన భావోద్వేగమైన లేఖ..!


నేటి హీరోలలో ఒక్క హీరోకి ఒకపెద్ద హిట్‌ వస్తే చాలు దర్శకులని కూడా పట్టించుకోరు. తమ స్వయంకృషి వల్ల, తమ ఇమేజ్‌ వల్లనే ఆ చిత్రం ఆడిందంటూ ఉంటారు. కానీ ప్రభాస్‌ మాత్రం తాను ఆ టైప్‌ కాదని నిరూపించాడు. 'బాహుబలి-ది బిగినింగ్‌' విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్బంగా ప్రభాస్‌ రాసిన భావోద్వేగమైన లేఖ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. 'బాహుబలి' జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను ఆ స్థాయికి తెచ్చిన ఆ చిత్రాన్ని మర్చిపోలేను. 

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకే కాదు.. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ షూటింగ్‌ సమయంలో నన్ను ఎంకరేజ్‌ చేసిన, నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతులు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా నన్నే కాదు.. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన యూనిట్‌కి, రాజమౌళిగారికి నా కృతజ్ఞతలు అంటూ లేఖలో పేర్కొన్నాడు. 

కాగా ప్రస్తుతం ప్రభాస్‌ సుజీత్‌ దర్శకత్వంలో తన యువి క్రియేషన్స్‌ బేనర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకంగా 150కోట్లతో 'సాహో' చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టింది. మరో వైపు ఈ చిత్రం కోసం బాలీవుడ్‌కి చెందిన కత్రినా కైఫ్‌, శ్రద్దాకపూర్‌, దిశాపటాని, పూజాహెగ్డేలతో పాటు పలువురిని పరిశీలించి చివరకు జేజమ్మకే ఓటు వేశారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు ఇందులోంచి స్వీటీని తొలగించారట. ఆమె ఈ చిత్రంలో నాజూకుగా కనిపించాలని, కానీ 'సైజ్‌జీరో'తో బరువు పెరిగిన అనుష్క కాస్త లావు తగ్గినప్పటికీ యధాతథ స్థితికి రాలేదట. 

అవసరమైన బరువు కంటే ఆమె దాదాపు పది కేజీల వరకు బరువుందని అంటున్నారు. ఇక 'బాహుబలి' వేడుకల్లో కూడా స్వీటీ బొద్దుగానే కనిపించింది. మరి రాజమౌళి మాయాజాలమో లేక గ్రాఫిక్స్‌ పుణ్యమో కానీ 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'లో బాగానే ఉంది. ఇక 'సాహో' టీం కొత్త హీరోయిన్‌ ఎంపికలో ఉంది. ఇక 'సాహో' తర్వాత ప్రభాస్‌ ప్రభుదేవాతో ఓ చిత్రం చేస్తాడని, ఇక కరన్‌ జోహార్‌, రోహిత్‌ శెట్టి, సాజిద్‌ నడియా వాలా వంటి వారు క్యూలో ఉన్నట్లుజి వార్తలొస్తున్నాయి...! 

Prabhas's Tweet on Baahubali's Two Years Completion:

Young Rebel Star Prabhas feels nostalgic about Baahubali the Beginning. As the film got its release completed two years, the Young Rebel Star posted a tweet.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs