Advertisement
Google Ads BL

'జై' సెటిల్మెంట్: పూరి తో మళ్లీ సినిమా..!


గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదేమిటంటే ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ఐడియాని కాపీ చేసాడు అని. ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' లోని జై పాత్ర పూరి కథలోని పాత్ర ఒక్కలాగే ఉందంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరి రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ న్యూస్ పై ఇప్పటివరకు ఎన్టీఆర్ గాని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ గాని ఎక్కడా స్పందించలేదు. కానీ న్యూస్ మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది.

Advertisement
CJ Advs

అయితే పూరి కథను ఎన్టీఆర్ కాపీ కొట్టాడంటూ లీకైన న్యూస్ వెనుక పూరి ఫ్రెండ్ ఛార్మి ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు  ఈ సమస్య ముగిసిపోయినట్లు చెబుతున్నారు. ఎవరికి తెలియకుండా తెర వెనుక ఎన్టీఆర్, పూరి రాజీకొచ్చినట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రం తర్వాత వస్తున్న 'జై లవ కుశ' పై ఎటువంటి నెగెటివ్ ఫీలింగ్ రావడం ఎన్టీఆర్ కి ఇష్టం లేక పూరితో ఎన్టీఆర్ రాజీకొచ్చినట్లు చెబుతున్నారు. ఆ రాజీలో భాగంగా ఈ కాపీ మేటర్ సెటిల్ చేసినట్టు చెబుతున్నారు. అయితే సెటిల్మెంట్ లో భాగంగా  ఎన్టీఆర్, పూరి తో ఒక సినిమా చెయ్యడానికి  కమిట్ అయ్యాడని అంటున్నారు. 

మరోపక్క పూరి కూడా ఈ విషయంలో రచ్చ చెయ్యడం ఇష్టం లేదని అందుకే ఈ రాజీకి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ఎన్టీఆర్ కి ఈ విషయమై ఎక్కడా బయట మాట్లాడనని మాటిచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ మేటర్ ఇంతటితో సద్దుమణిగితే బాగానే ఉంటుంది.  ఇక ఈ సెటిల్మెంట్ వ్యవహారం చూస్తుంటే త్వరలోనే ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందన్నమాట.

Jai Lava Kusa Movie Jai Character Controversy Ended:

Jr NTR gives Again Chance to Puri Jagannadh for Jai Controversy. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs