ప్రతి ఏడాది దేశంలో అతి ప్రభావ వంతులైనా జాబితాలు వస్తూనే ఉంటాయి. కాగా ఈ జాబితాలో తెలుగువారు కనిపించడం అరుదు. కానీ ఈసారి తాజాగా ప్రకటించిన జాబితాలో పి.వి.సిందు తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలోని అతి పిన్నవయస్కురాలిగా కూడా సిందు సంచలనం సృష్టించింది. ఇక 'బాహుబలి'తో నేషనల్, ఇంటర్నేషనల్ ఫేమ్ పొంది, నేషనల్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కి 6వ స్థానం దక్కడం విశేషం.
బ్యాడ్మింటన్ స్టార్‌గా సంచలనం సృష్టిస్తూ అత్యంత ప్రతిభావంతుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సిందు వయసు కేవలం 22 ఏళ్లే కావడం విశేసం. మరో పక్క ప్రభాస్‌కి ఆరో స్థానం లభించడం చూస్తే నిజంగానే ఆయన నేడు యావత్ దేశానికి ఐకాన్‌గా ఉన్నాడని, ఇండియన్ స్క్రీన్‌పై నయా సూపర్‌స్టార్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ విధంగా తెలుగువారు మొదటి స్థానం, ఆరో స్థానం దక్కించుకోవడం పట్ల తెలుగు వారు ఎంతో ఆనందంగా ఉండగా, ఇంతకాలం ఆధిపత్యం చెలాయిస్తున్న ఉత్తరాది వారికి ఇది పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. బాలీవుడ్ వివాదాస్పద నటి రాధికా ఆప్టే 10 వస్థానం దక్కించుకోగా, జావెలిన్‌త్రో యువ సంచలనం నీరజ్ చోప్రా 11 వస్థానంలో నిలిచాడు.