Advertisement
Google Ads BL

రానా తెగ వాడేసుకుంటున్నాడు..!


దగ్గుబాటి రానా మొదటి నుంచి కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో మొదటి నుంచి గెస్ట్‌రోల్స్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా మన స్టార్స్‌ ఇప్పుడు ఇతర భాషలపై కాన్సన్ట్రేషన్ చేస్తుంటే రానా ఆ పని ఎప్పుడో చేశాడు. ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక 'బాహుబలి'లో భళ్లాలదేవతో అది పీక్స్‌కి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి కమర్షియల్‌ అంశాలు, యాక్షన్‌ సీన్స్‌కి, పాటలకు, కమర్షియల్‌ హంగులకి దూరంగా కొత్త కుర్రాడు సంకల్ప్‌ రెడ్డితో చేసిన 'ఘాజీ' చిత్రం కూడా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదలై బాగా లాభాలను తెచ్చిపెట్టింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన తేజ దర్శకత్వంలో కాజల్‌ హీరోయిన్‌గా, ఆయన తండ్రి సురేష్‌బాబు నిర్మిస్తున్న 'నేనే రాజు...నేనే మంత్రి' చిత్రం మొదలైనప్పుడు కేవలం తెలుగుకే అనుకున్నప్పటికీ విడుదలయ్యే సమయానికి తమిళం, హిందీలలో క్రేజ్‌ తెచ్చుకుంది, సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రం దేశంలోనే యూనివర్శల్‌ సబ్జెక్ట్‌తో రెడీ అయింది కాబట్టి దేశంలో ఏ భాషలో విడుదలైనా దీనికి క్రేజ్‌ తగ్గదు. 

ఇక తమిళంతో పాటు హిందీలో గుర్తింపు ఉన్న కాజల్‌ నటిస్తుండటం మరో ప్లస్‌ పాయింట్‌. కాగా ఈ చిత్రం తమిళ వెర్షన్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. టైటిల్‌గా 'నాన్‌ ఆనయిట్టాల్‌' అనే పేరును ఖరారు చేశారు. దీనికి నేను ఆదేశిస్తే అని మీనింగ్‌. ఇక ఈ టైటిల్‌ తమిళులు దైవంగా కొలిచే ఎంజీఆర్‌ చిత్రంలోని ఓ పాట పల్లవి కావడంతో దీనికి మంచిస్పందన వస్తోంది. ఈ పాట తమిళంలో ఎవర్‌గ్రీన్‌. 

ఇక ఇందులోని ఓ డైలాగ్‌ సంచలనానికి కారణమైంది. 'నేను కూడా 100 మంది ఎమ్మెల్యేలను స్టార్‌ హోటల్‌లో పెడితే నేనే సీఎం' అనే వ్యంగ్యమైన సెటైరిక్‌ డైలాగ్‌ ఉంది. ఇటీవల తమిళ రాజకీయాలలో చిన్నమ్మ శశికళ తరపున ముఖ్యమంత్రి పళనిస్వామి ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కి తరలించడం, గతంలో ఎన్టీఆర్‌ విషయంలో చంద్రబాబు సీఎం కావడానికి వైస్రాయ్‌ హోటల్‌లో ఎమ్మెల్యేలను దాచి, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించే ఘటనదాకా ఈ డైలాగ్‌ వింటే ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తు కొస్తుండటం వల్ల ఈ మూవీపై క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. 

Rana Film Title 'Naan Aanaiyittal' in Tamil:

Rana Daggubati and Kajal Aggarwal starring movie ' Nene Raju Nene Manthri' this movie title 'Naan Aanaiyittal' in tamil, In this movie tamil varsion trailer also released.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs