Advertisement
Google Ads BL

పవన్‌ బయలు దేరుతున్నాడు....!


పవన్‌ కళ్యాన్‌ చిత్ర మంటే సినిమా ఎలా ఉన్నా సాంగ్స్‌ మాత్రం అదరగొడుతాయి. ఆయన నటించిన దాదాపు ప్రతి చిత్రం ఓ మ్యూజికల్‌ హిట్టే, కానీ ఆయన ఎంతో నమ్మకంగా అనూప్‌ రూబెన్స్‌కి చాన్స్‌ ఇచ్చిన కాటమరాయుడు చిత్రం మ్యూజికల్‌గా ఫ్లాప్‌. దాంతో ప్రస్తుతం తమిళంలో అదరగొడుతున్న సంగీత సంచలనం అనిరుద్‌ని.. పవన్‌ తాజా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఆయన చేస్తోన్న తొలి చిత్రం ఇదే. కాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అంటే నిన్నా మొన్నటి వరకు దేవి శ్రీ ప్రసాదే ఉండేవాడు. కానీ త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ నితిన్‌-సమంత ప్రధాన పాత్రల్లో నటించిన 'అ..ఆ'తో దానికి మంగళం పాడి అనిరుధ్‌ని తీసుకున్నాడు. కానీ అనిరుద్‌ తమిళంలో స్టార్స్‌ చిత్రాలలో బిజీగా ఉండటంతో మిక్కీజెమేయర్‌తో సర్దుకుపోయాడు. ఇక అనిరుద్‌ విషయానికి వస్తే ధనుష్‌ నటించిన '3' చిత్రంలోని 'కొలవరి.. కొలవరి'తో ఫేమస్‌. 

తాజాగా ఆయన సంగీతం అందించిన అజిత్‌ చిత్రం 'వివేగం' పాటలు సెన్సేషన్స్‌ సృష్టిస్తున్నాయి. దాంతో అనిరుద్‌ తొలిసారిగా తెలుగులో చేస్తున్న త్రివిక్రమ్‌- పవన్‌ల చిత్రంలోని ఆడియో మ్యూజికల్‌ హిట్టు కావడం ఖాయమంటున్నారు. ఇక తన చిత్రంలోని పాటలు ఎలా ఉన్నా చిత్రీకరణతో కనుల పండువగా చేయడం త్రివిక్రమ్‌ స్లైల్‌. ఇక ఈ చిత్రం యూనిట్‌ ఈనెల 19న బల్గేరియా వెళ్లనుంది.

అక్కడ రెండు పాటలతో పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్‌ చిత్రీకరించనున్నారు. గతంలో త్రివిక్రమ్‌- పవన్‌ల 'అత్తారింటికి దారేది'సమయంలో కూడా స్పెయిన్‌లో కొన్ని పాటలు తీసి, మరికొన్ని ముఖ్యమైన సీన్స్‌ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను ఈసారి ఇటలీలో కాకుండా బల్గేరియాలో ప్లాన్‌చేశారు. 

Pawan and Trivikram Film Music Director Anirudh:

Pawan Kalyan and Trivikram Srinivas new film tamil music director by Anirudh. He is gives music first time to Pawan Kalyan film.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs