Advertisement
Google Ads BL

వీరాభిమానం అంటే ఇలా ఉండాలి...!


రజినీకి సామాన్య ప్రేక్షకులలోనే కాదు..పలువురు సినీ ప్రముఖులలో కూడా వీరాభిమానులు ఉన్నారు. నేడున్న ప్రతి స్టార్‌కి, ప్రతి యంగ్‌ హీరోకి ఆయనో ఇన్‌ స్పిరేషన్‌. కాగా 12.12.1950కి ఓ ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే అది రజినీకాంత్‌ పుట్టిన రోజు. ఇప్పుడు ఆయన ఓ వీరాభిమాని ఇదే డేట్లతో ఓ చిత్రం చేయనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సెల్వ ఈ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్ర కథకి, రజినీ బయోగ్రఫీకీ ఏమీ లింకులేదు. రజినీకాంత్‌ని విపరీతంగా అభిమానించే ఓ నలుగురి జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఈ చిత్రం మూలకధ. ఇందులోని నలుగురు యువకుల పేర్లు బాషా, ముత్తు, బిల్లా, యజమాన్‌. వీరికి ఎదురైన విపత్కర పరిస్థితులను ఎలా అదిగమించారనేది సూక్ష్మంగా ఈ చిత్రం కథ. ఇక దీనిలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న అతని పేరు సెల్వ అయినప్పటికీ తన పేరును ఆయన కబాలి సెల్వగా మార్చుకున్నాడు. 

ఇటీవలే కబాలి సెల్వ రజినీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. గతంలో తెలుగులో కూడా ఇలాంటి హీరోల ఫ్యాన్స్‌ పేరుతో తెలుగులో సూపర్‌ స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవిలపై ఇలాంటి చిత్రాలు వచ్చాయి. ఇక టాప్‌స్టార్స్‌ అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల డూప్‌లు నటిస్తూ ఎన్టీఆర్‌ నగర్‌ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మరి 12.12.1950 ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది. 

Rajinikanth Date Of Birth Film '12.12.1950':

Now Rajinikanth fan to make a film with similar dates. Popular actor, Director Selva acting in this film and also he is director of this film.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs