Advertisement
Google Ads BL

అఖిల్ దృష్టిలో ఈ హీరో హిట్ మెషిన్..!


టాలీవుడ్ లోకి ఎవరి అండదండలు లేకుండా వచ్చి ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన నాని మొదట్లో టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గానే అడుగుపెట్టాడు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి 'అష్టాచెమ్మా' తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటినుండి  నానికి టాలీవుడ్ లో ఎదురులేకుండా పోయింది. మధ్యలో మాస్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్న నాని మళ్ళీ 'ఎవడే  సుబ్రమణ్యం'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుండి అపజయమే ఎరగకుండా వరుసగా హిట్స్ కొట్టేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఈ ఏడాది మొదట్లోనే 'నేను లోకల్' అంటూ హిట్ కొట్టిన నాని ఇప్పుడు 'నిన్ను కోరి' చిత్రంతో మరోమారు సూపర్ హిట్ కొట్టాడు. నివేత థామస్ తో కలిసి రెండో హిట్ అందుకున్న నానిపై టాలీవుడ్ ప్రముఖులంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'నిన్ను కోరి' చిత్రంలో నాని నటనకు దాదాపు అందరూ ఫిదా అయ్యారంటే అతిశయోక్తి లేదంటున్నారు. అన్నిటిలో ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ చేసిన పొగడ్త మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. 'వన్‌ అండ్‌ ఓన్లీ నానికి కంగ్రాట్స్‌. నువ్వు హిట్‌ మెషిన్‌గా మారిపోయావు బ్రదర్‌. నీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం మాట్లాడుకుందామ’ని ట్వీట్‌ చేసి అందరిని ఆశ్చర్యంలో పడేశాడు.

నాని ని గొప్పగా పొగడమే కాకుండా నాని నుండి ఎంతో నేర్చుకోవాలని అఖిల్ చెప్పడం చూస్తుంటే నాని పై అఖిల్ కున్న అభిమానం అర్ధమవుతుంది. ఒక్క అఖిల్ మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది నాని గురించి ఈ రకమైన వ్యాఖ్యలే చేస్తున్నారు.

Akhil Akkineni Tweet on Hero Nani:

Akhil Akkineni Says Hero Nani a Hit Machine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs