తెలుగులో 'బిగ్‌బాస్' షో రానుందని, దీనికోసం స్టార్ మా చానెల్‌వారు హోస్ట్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ని పెట్టుకున్నారని తెలిసినప్పటి నుంచి తెలుగు వీక్షకుల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ షోని హోస్ట్ చేయడం కోసం ఎన్టీఆర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు హోస్ట్‌లుగా పని చేసిన నాగార్జున, చిరంజీవిల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.
మరోపక్క ఈ షోని పూణే లోనే జరపాలని, తాను చెప్పిన సాంకేతిక నిపుణులను, భారీ బిగ్‌బాస్ హౌస్‌ని డిమాండ్ చేశాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ వాటిని ఖండించాడు. దేవుని దయ వల్ల నా దగ్గర నా భార్యను, కుమారుడిని, తల్లిని బాగా చూసుకునేంత ఆర్ధిక స్తోమత నాకుంది. ఈ షో కోసం నేనేమీ డిమాండ్ చేయలేదు. నాకెంత ఇవ్వాలో నిర్వాహకులకు తెలుసు. ఇక ఫలానా వారినే టెక్నీషియన్స్‌గా పెట్టుకోవాలని నేను ఎవ్వరినీ డిమాండ్ చేయలేదు.
ఇక పూణేలో 'జై లవ కుశ' షూటింగ్ జరపాలని, దాని కోసం ఎప్పుడో లోకేషన్లు వెతికాం. అదృష్టం కొద్ది మా 'జై లవకుశ'తో పాటు బిగ్ బాస్‌షో కూడా పూణెలోనే పెట్టడం జరిగింది. ఇక ఈ షోలో ఎవరు పార్టిసిపెంట్స్‌గా పాల్గొంటారనేది నాకు కూడా తెలియదు. మీలాగే ఎవరెవరు పాల్గొంటారా? అని నేను కూడా మీలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రెండు వారాల నుంచి ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారో చెప్పమని నిర్వాహకులను కోరుతున్నా కూడా వారు మౌనంగా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.
ఇక ఇందులో పాల్గొనే వారే కాదు.. ఎలిమినేట్ అయ్యేవారెవ్వరో కూడా నాకుతెలియదు. ఇక ఇందులోని పార్టిసిపెంట్స్‌ని కొందరిని నేను రికమండ్ చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదు. అసలు ఈ షో ఎలా ఉంటుందో కూడ తెలియని నాకు ఎవరినో రికమెండ్ చేశానంటే నవ్వొస్తోంది.. అంటూ చెప్పుకొచ్చారు.