Advertisement
Google Ads BL

బాలయ్య నిజ జీవితంలో కూడా హీరోనేనట..!


బాలకృష్ణ అంటే మాస్‌కి పర్యాయపదం. ఆయన చిత్రాలలో పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌,వీరోచితమైన యాక్షన్‌ సీన్స్‌ కంపల్సరీ. అది ఏ జోనర్‌ సినిమా అయినా సరే అవి చాలా ముఖ్యం. కాగా బాలకృష్ణ యాక్షన్‌ సీన్స్‌లో డూప్‌లకి అవకాశం ఇవ్వకుండా తానే ఎంత రిస్క్‌ షాట్‌ అయినా చేస్తాడు. 'లెజెండ్‌'లో ఆయన చేసిన యాక్షన్‌ సీన్స్‌కి, 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో గుర్రపు స్వారీ నుంచి కత్తి యుద్దాల వరకు తానే చేశాడు. 

Advertisement
CJ Advs

తాజాగా బాలయ్య పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తన 101 వ చిత్రంగా 'పైసా వసూల్‌' చేస్తున్నాడు. ఇటీవల జరిగిన పోర్చుగల్‌ షెడ్యూల్‌లో కూడా బాలయ్య ఓ కారు ఛేజింగ్‌ యాక్షన్‌ సీన్‌ని స్వయంగా చేశాడట. తాజాగా ఆయన హైదరాబాద్‌ షెడ్యూల్‌లో కూడా తనే సొంతంగా భారీ యాక్షన్‌ సీన్స్‌ చేశాడని, ఇందులో నటిస్తున్న కైరా దత్‌ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తింది. ఈ యాక్షన్‌ సీన్‌ని చూసిన ఆమె ఇలా రియల్‌గా సాహ సోపేతమైన రియల్‌ యాక్షన్‌ హీరోని ఇంత వరకు చూడలేదని ఆశ్యర్యానికి లోనైంది. 

ఈ వయసులో కూడా బాలయ్య చేస్తున్న రియల్‌ యాక్షన్‌ సీన్స్‌ని చూసి తన నోట మాటరాలేదని తెలిపింది. ఇక ఈ చిత్రంలో శ్రియా శరన్‌తో పాటు ముస్కాన్‌ అనే కొత్తనటి హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, కైరా దత్‌ ఓ ఐటం సాంగ్‌తో పాటు కొన్ని సీన్స్‌లో నటించే పాత్రను చేస్తోంది. భవ్య ఆర్ట్స్‌ బేనర్‌లో ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న దసరా కానుకగా విడుదల కానుంది. 

Kyra Dutt Compliments to Balakrishna:

Balakrishna acting movie 'Paisa Vasool' director by Puri Jagannadh. in this movie schedule recently in hyderabad balayya doing real sceance. kyra Dutt shok and compliments to balakrishna. Paisa Vasool release on september 29th.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs