Advertisement
Google Ads BL

నేచురల్‌ స్టార్‌ అంత పని చేస్తున్నాడా..?


గతంలో నాని తన చిత్రాలైన 'పైసా, జెండాపై కపిరాజు' చిత్రాలు విడుదలలో ఆటంకం ఎదుర్కొంటూంటే ఆయననే ఆ చిత్రాలను ఓన్‌గా టేకోవర్‌ చేసి తెరవెనుక నిర్మాతగా చాలా నష్టపోయాడని అంటారు. ఇక తాజాగా నాని 'జెండాపై కపిరాజు' దర్శకుడు సముద్రఖనితో మరో చిత్రంలో చేయనున్నాడనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక నానిని సినిమాకి ఒప్పించాలంటే ఆ చిత్రం కథ డిఫరెంట్‌గా ఉండాలి. తాను మాత్రమే ఆ పాత్రను చేయగలననే నమ్మకం కలగాలి. అవి ఉంటే సినిమాలో తన నిడివి ఎంత అని కూడా పట్టించకోడు. గతంలో సమంతను ప్రేమించి, విలన్‌ చేత హత్య చేయబడి ఆ తర్వాత ఈగగా మారి తన ప్రతీకారం తీర్చుకునే పాత్రలో నటించాడు. ఆయన కంటే ఈగగా మారిన స్టోరీనే దీనిలో ఎక్కువ. దాంతో ఆ తర్వాత 'ఎలుకా.. మజాకా' వచ్చింది. త్వరలో రవిబాబు పంది చిత్రం రానుంది. 

ఇదే సమయంలో నాని నిర్మాతగా మరో డేరింగ్‌ డిసిషన్‌ తీసుకున్నాడని సమాచారం. 'చేప' పేరుతో తెరకెక్కనున్న నేపధ్యంలో కొత్త దర్శకుడు ప్రశాంత్‌ శర్మ దీనికి దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. కథ పూర్తి వైవిధ్యంగా ఉండటంతో నానినే నిర్మిస్తున్నాడు. మరి 'చేప'లో నాని నటిస్తాడా? లేక మరో యంగ్‌ హీరో నటిస్తాడా? అనేది తెలియాల్సివుంది. 

Hero Nani Producing New Movie 'Chepa':

Nani is producing another daring decision as producer. The new director Prashant Sharma is the director of the movie 'fish'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs