Advertisement
Google Ads BL

మొన్న నీలాంబరి.. నిన్న శివగామి.. మరి నేడు?


బాహుబలిలో హీరో హీరోయిన్స్, విలన్ పాత్రలకి ఎంతగా పేరొచ్చిందో తల్లిగా చేసిన శివగామి రామకృష్ణ కి అంతే పేరొచ్చింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఎంతగా మెప్పించిందో బాహుబలి చూసిన వాళ్లకి అర్ధమవుతుంది. తల్లి అంటే ఇలానే ఉంటుందా.. అనిపిస్తుంది. బాహుబలిలో రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తిండి పోతుంది.  రాజమాత శివగామి క్యారెక్టర్ బాహుబలి మెయిన్ పిల్లర్ లాంటిదని... రాజమౌళి ఎంతగా పొగిడాడో కూడా తెలిసిందే. 

Advertisement
CJ Advs

మరి ఒకప్పుడు రజినీకాంత్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరిగా ఎంతటి కీర్తి ప్రతిష్టలు అందుకుందో ఇప్పుడు బాహుబలిలో కూడా శివగామిగా ఆమె అంతే కీర్తి ప్రతిష్టలు అందుకుంది. నరసింహా సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ గా రమ్యకృష్ణ అద్భుతమైన నటన కనబర్చింది. ఇక శివగామిగా కూడా రమ్యకృష్ణ అదిరిపోయే పెరఫార్మెన్సు తో ఆకట్టుకుంది. అయితే రమ్యకృష్ణ కి ఇప్పుడు అలాంటి రోల్ చేసే అవకాశం ఒకటి వచ్చిందని అంటున్నారు. 

ఈసారి రమ్యకృష్ణ పొలిటీషియన్స్ గా అదరగొట్టబోతుందట. నారా రోహిత్ హీరోగా పవన్ మల్లెల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న న్యూ మూవీలో రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా కనిపించనుందట. మూవీలో మేజర్ సీన్లు రమ్యకృష్ణ మీదే ప్లాన్‌ చేశాడట డైరెక్టర్. ఈ సినిమాలో రమ్యకృష్ణ, నారా రోహిత్ మధ్య వచ్చే సీన్లు, డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయనేది చిత్ర యూనిట్ మాట. అయితే ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.

Ramya Krishna in Nara Rohit Film:

<span>Ramya Krishnan</span>&nbsp;will be seen as a powerful politician in the new movie directed by Pawan Mallela and hero by Nara Rohit.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs