Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తెలిసిపోయింది!


తాజాగా బిగ్ బాస్ షో లాంచ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు స్టార్ మా యాజమాన్యం మరియు షో నిర్వాహకులు. ఇక బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేయనున్న టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ ఈ షో కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలున్నాయి. అయితే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న బిగ్ బాస్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మీడియా నుండి ఒక ప్రశ్న ఎదురైంది.  ఇదేమిటంటే మీరు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్నందుకు గాను ఎంత పారితోషకం తీసుకున్నారని అడగ్గా... దానికి ఎన్టీఆర్ నవ్వుతూ మీరు ఊహించుకున్నంత పారితోషకం మాత్రం తీసుకోవట్లేదు. కానీ నేను తృప్తి పడేంత డబ్బు మాత్రం నాకిచ్చారు. అసలు బిగ్ బాస్ కోసం ఎంత తీసుకున్నానో గుర్తే లేదంటూ.. సమాధానం దాటవేశాడు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ చెప్పకపోతేనేం ఎన్టీఆర్ బిగ్ బాస్ కోసం తీసుకున్న ఫిగర్ ఇదే అంటున్నారు. ఎన్టీఆర్ ఈ షో లో ఒక్కో ఎపిసోడ్ కి ముందు నుండి చెబుతున్నట్టుగానే 50 లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నాడంటున్నారు. అయితే బిగ్ బాస్ షో సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా  12 ఎపిసోడ్లు ప్లాన్ చేశారట. అయితే మూడు సీజన్స్ గా ఈ షో ఉండబోతుంది. అంటే ఈ లెక్కన ఒక్కో సీజన్ కు ఎన్టీఆర్ 6 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి మూడు సీజన్స్ కి కలిపి ఎన్టీఆర్ 18  కోట్ల పారితోషం అందుకుంటున్నాడు. మరి ఈ రెమ్యునరేషన్ చూస్తుంటే గతంలో బుల్లితెర మీద సందడి చేసిన నాగార్జున, చిరంజీవి పారితోషకాలకన్నా బాగా ఎక్కువే.

ఇకపోతే ఈ షో ఈ నెల 16  నుండి మా టీవీ లో ప్రసారం కాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తునందుకు ఈ షో కి మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక షో మొదలయ్యాక టీఆర్పీ రేటింగ్స్ ఎలా వుండబోతున్నాయో మాత్రం కాస్త సస్పెన్స్ అంటున్నారు.

Bigg Boss Host Remunaretion 6 Crores For One Season:

Jr NTR hosted in Star Maa Channel 'Bigg Boss' show, this show host Jr NTR remunaretion 18 crores for Three seasons. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs