గత చాలా ఏళ్లుగా హిట్ లేని దర్శకుడు ధర్మతేజ అలియాస్ తేజ రానాతో 'బాహబలి', 'ఘాజీ'ల తర్వాత సోలోహీరోగా చేస్తున్నడు. నిజానికి రానా ఫిజిక్‌కి, మంచి వాయిస్ ఉండి, తన తాత స్వర్గీయ లెజెండరీ నిర్మాత డి.రామానాయుడు మనవడు కావడం, ఇక ఆయన తండ్రి సురేష్‌బాబు ఆచితూచి చిత్రాలు తీసే వ్యక్తి కావడం, బాబాయ్ వెంకటేష్ ప్రోత్సాహం ఉన్నా ఆయన టాలెంట్ మాత్రం కేవలం ఇటీవలే బయటపడింది.
వాస్తవానికి ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెండితెరకు హీరోగా పరిచయమైన 'లీడర్' కూడా మంచి చిత్రమే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఇది విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా కమర్షియల్‌గా ఫెయిలైంది.కానీ తాజాగా ఆగష్టు11న విడుదల కానున్న ఈ చిత్రం కూడా పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందుతుండటం విశేషం. ఈ చిత్రం టైటిల్ నుంచి ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో బాగా స్పందన రాబట్టుకుంది.
ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో.. ఈ చిత్రం సోలోహీరోగా రానాకి, దర్శకునిగా ఫేడవుట్ అయిన తేజాకి, చాలా కాలం నుంచి సొంతగా సినీ నిర్మాణం చేయని సురేష్ బాబులకి కూడా కీలకమే. ఇక తన కొడుక్కి ఎలాగైనా హిట్టు ఇవ్వాలనే కసితో సురేష్‌బాబు ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో టాప్‌స్టార్ కాజల్ అగర్వాల్ రానా సరసన నటిస్తోంది. తనకు హీరోయిన్‌గా తొలి చాన్స్ ఇచ్చిన దర్శకుడు తేజకు మరో హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
ఇక చిత్రం యూనివర్శల్ సబ్జెక్ట్ కావడం, రానా, కాజల్‌లకు బాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈచిత్రాన్ని ఏకంగా ఈ మూడు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన లుక్స్‌లో రానా, కాజల్‌లు సెక్సీగా కనిపిస్తున్నారు. దీన్నిబట్టి ఈ చిత్రంలో రానా, కాజల్‌ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్బుతంగా, రొమాన్స్ కూడా పండుతుందని,చీరకట్టులో కూడా యువతను వలలో వేసే సత్తా మన చందమామ కాజల్‌కి ఉందని ఒప్పుకోవాల్సిందే.