Advertisement
Google Ads BL

తాత బయోపిక్ లో బాబాయ్... అద్భుతమేగా!!


ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ మీద జరుగుతున్న చర్చ మరే ఇతర సినిమాకి జరగడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఎలా తీస్తారు, వాస్తవాలు చూపెడతారా, లేకుంటే అన్ని అబద్దాలే చూపెడతారా, అసలు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రకి సరిపోతాడా, ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన మనవడు మోక్షజ్ఞ నటిస్తున్నాడా, అలాగే మరో మనవడు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తాడా? అసలు మహోన్నత వ్యక్తిగా కీర్తి గడించిన ఎన్టీఆర్ బయోపిక్ ని మెంటల్ డైరెక్టర్ గా పేరుగాంచిన... డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎలా తెరకెక్కిస్తాడో? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరక్క తెగ ఇదైపోతున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పై ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఇలా వుంది. హైదరాబాద్ లో జరిగిన బిగ్ బాస్ షో లాంచ్ ప్రెస్ మీట్ కి హాజరైన ఎన్టీఆర్ ని మీడియా వారు.. ఎన్టీఆర్ బయోపిక్ లో మీరు నటిస్తున్నారా అని ప్రశ్నించగా... దానికి ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు గారు కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల ఆస్తి.. తెలుగు ప్రజల సొత్తు. అలాంటి వ్యక్తి మీద సినిమా తీయడమంటే తెలుగు వారందరి మీద సినిమా తీసినట్టే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీయడమంటే తెలుగువారి బయోపిక్‌ తీయడమే అంటూ తన స్పందన తెలియజేశాడు.

అలాగే ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో మీ బాబాయ్ బాలకృష్ణ నటించడంపై మీ స్పందన ఏమిటని అడగా... దానికి కూడా ఎన్టీఆర్... తారకరామారావు గారి బయోపిక్ లో బాలకృష్ణ బాబాయ్ నటించడం ఓ అద్భుతం అంటూ ఇంకేం చెప్పకుండా ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను అంటూ సమాధానం దాటవేశాడు.

Jr NTR Responds On RGV-NTR Biopic:

<span>'I wish to see Babai in the role of My Grand-Father in NTR biopic', Jr NTR Said.&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs