Advertisement
Google Ads BL

వారెవరో ఎన్టీఆర్ కి కూడా తెలియదంట..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా లో బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడని అనౌన్సమెంట్ రాగానే ఆ షో పై విపరీతమైన హైప్ వచ్చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ ఇలా బుల్లితెర మీద షో చేస్తున్నాడు అనగానే ఆ షోకి అంత క్రేజ్ రాక ఏం చేస్తుంది మరి. ఇకపోతే బిగ్ షో షూటింగ్ మొత్తం పూణేలోని ఒక భారీ హౌస్ లో జరగనుందని తెలిసిన విషయాలే. 70  రోజుల పాటు 12 మంది పోటీదారులు ఒకే ఇంట్లో ఎటువంటి ఫోన్స్ గాని, న్యూస్ పేపర్స్ గాని, టీవీ లు గాని అస్సలు ఏమి అందుబాటులో లేకుండా జరుగుతున్న షో ఇది.

Advertisement
CJ Advs

ఇక ఈ షోకి సంబందించిన ప్రెస్ మీట్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది. బిగ్ బాస్ షో లాంచ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న తారక్ అనేక విషయాలు మీడియాతో పంచుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ ప్రోమోని కూడా లాంచ్ చేసిన ఎన్టీఆర్ కి ఛాలెంజ్ అంటే చాలా ఇష్టమట. ఆ ఛాలెంజ్ ని ఇష్టపడే... స్టార్ మా బిగ్ బాస్ లో హోస్ట్ ఆఫర్ ఇవ్వగానే ఒప్పేసుకున్నానని చెబుతున్నాడు. ఇక ఈ షో చెయ్యడం ఒక మంచి అనుభూతి అంటున్నాడు. అయితే పారితోషికం ఎంత తీసుకుంటున్నారని మీడియా వారు ఎన్టీఆర్ ని డైరెక్ట్ గా ప్రశ్నించగా... నాకు ఈ షో నచ్చి చేస్తున్నా... కానీ పారితోషికం గురించి పెద్దగా ఆలోచించలేదంటూ దాటవేశాడు.

అలాగే ఈ బిగ్ బాస్ షో లో ఎవరెవరు పార్టిసిపెంట్స్ పాల్గొనబోతున్నారని ప్రశ్నించగా... నాకు తెలియదండి. నేను ఎన్నిసార్లు అడిగినా షో నిర్వాహకులు నాకు చెప్పలేదు. రెండు ప్రోమోస్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అడిగినా వారు నాకు చెప్పలేదు. మే.. బీ నాకు కూడా వారు సర్ప్రైజ్ ఇస్తారేమో. ఆ షో స్టార్టింగ్ రోజునే వారెవరో నాకు తెలుస్తుందేమో అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. ఇకపోతే ఎన్టీఆర్ ఈ షో చెయ్యడానికి చాలా ఆసక్తి చూపుతున్నానని... ఇండియా వైజ్ గా బిగ్ బాస్ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ఇక్కడ తెలుగులో కూడా అంతే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఎన్టీఆర్.

NTR Speech at Big Boss Promo Launch Event:

'When I was offered the show, I said yes instantly because of the challenge it presented to me as an actor', NTR Said. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs