Advertisement
Google Ads BL

'బిగ్‌బాస్‌'పై విమర్శల పరంపర..!


తెలుగులో స్టార్‌మాలో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయనున్న 'బిగ్‌బాస్‌' షో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టిసిపెంట్స్‌ అయిన సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందనే వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. పోసాని, మంచులక్ష్మి, స్నేహ, సదా.. వంటి వారి పేర్లు వినబడుతున్నాయి. కానీ తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌ చేస్తున్న 'బిగ్‌బాస్‌'షో మాత్రం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. స్టార్‌ సెలబ్రిటీలు ముందుకు రాకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. 

Advertisement
CJ Advs

తమిళనాడు ప్రజానీకానికి కూడా ఇది రుచించేలా లేదు. తాజాగా మాజీ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌ 'బిగ్‌బాస్‌'పై విరుచుకుపడింది. ఇది ఓ చెత్త షో అని తేల్చేసింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది విరుద్దమని తేల్చిచెప్పింది. తనకు కూడా ఇందులో పాల్గొనాలని ఆఫర్‌ వచ్చిందనీ,కానీ తాను 10కోట్లు ఇస్తానన్నా దానిని చేయనన్నది. ఈ షో ముఖ్యంగా దక్షిణాది ప్రజల మనోభావాలకు విరుద్దమని, ముక్కు మొహం తెలియని వారితో ఎన్నో రోజులు కలిసి ఉండటం అనేది తాను జీర్ణించుకోలేనని, ప్రజలు కూడా దీనిని స్వీకరించలేరంది. 

ఈ షో వల్ల కుటుంబంలో, వ్యక్తిగత సంబంధాలలో కూడా కలతలు వస్తాయని, మన సంప్రదాయాలను మనమే చేజేతులారా ఇలాంటి షోల వల్ల చెడగొట్టుకుంటున్నామని మండిపడింది. వ్యక్తిగత స్వేచ్చ దెబ్బతింటుందని, కొన్ని రోజుల పాటు డబ్బు, ఫేమ్‌ కోసం ఓ ఇంటిలో బందీలుగా మారడం సరికాదని చెప్పింది. మగా ఆడా తేడా లేకుండా ఒకే ఇంట్లో అలా రోజుల తరబడి ఉండటాన్ని పాశ్చాత్యదేశాల వారు, ఉత్తరాది వారు పట్టించుకోకపోయిన దక్షిణాదిలో ఏ భాషల్లో వచ్చినా ఈ షో క్లిక్‌ అయ్యే అవకాశాలే తనకు కనిపించడం లేదని అంటోంది. 

మరి షో మొదట్లోనే ఇలాంటి అభిప్రాయాలు వీక్షకుల మదిలో, మరీ పెద్దల మదిలోపడితే ఆ షోని తమ పిల్లలు చూడకుండా, తాము కూడా చూడటం మానుకుంటారని జోస్యం చెప్పింది...! 

Tamil Bigg Boss Show Update:

Redently former actress,director Lakshmi Ramakrishnan fire on tamil Bigg Boss show. In this show host Kamal Haasan.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs