Advertisement
Google Ads BL

కృష్ణవంశీ రెచ్చిపోయాడు..!


పాటలను తీయడంలో, పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలను సృష్టించడంలో కృష్ణవంశీది అందె వేసిన చేయి. కానీ ఆయనకు గత కొంతకాలంగా సరైన హిట్‌ రాలేదు. 'మహాత్మా, గోవిందుడు అందరివాడేలే'లు జస్ట్‌ ఓకే అనిపించాయి. 'చందమామ' చిత్రం ఆయనకు చివరి హిట్టు. ఇక దీంతో కృష్ణవంశీ కూడా నీతులు, బంధాలు, అనుబంధాలు చూపితే లాభంలేదనుకుని ముందుకు సాగాడని 'నక్షత్రం' ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక ఇందులో హీరోగా నటిస్తున్న సందీప్‌ కిషన్‌కి, హీరోయిన్‌ రెజీనాలకు కూడా తమిళంలో మంచి గుర్తింపే ఉంది. దాంతోనే ట్రైలర్‌లోనే ఓవర్‌యాక్షన్‌, అరుపులు, గోలలు వినిపిస్తున్నాయి...సో..దీనికి ఓవర్‌యాక్టింగ్‌ని చూసే తమిళ ప్రేక్షకులను కూడా అల్లరించేలా ఉన్నాయి. ఇక తాను పాటలు తీయడంలో ఎక్స్‌పర్ట్‌నే అయినా 'నక్షత్రం'లో మాత్రం ఆయన ఇక లాభం లేదనుకొని రెచ్చిపోయాడా? అనిపిస్తోంది. 

తాజాగా విడుదలైన 'ఏ పాప..ఏ పాపమ్‌' సాంగ్‌ టీజర్‌లో సాయి దరమ్‌ తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌ మద్య వచ్చే ఈ సాంగ్‌ యువతరాన్ని ఓ ఊపు ఊపుతోంది. ఈ పాటను చూస్తే నాటి 'అంత:పురం, ఖడ్గం'లోని పాటను మించిన మోతాదులో ఉంది. ఇక 'కంచె, ఓం నమోవేంకటేశాయ'లలో పద్దతిగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌ కూడా ఇక లాభం లేదనుకుని భారీ స్థాయిలో అందాల విందు చేస్తోంది. 

ముఖ్యంగా సాయి, ప్రగ్యాల మద్య వచ్చే ఈ సాంగ్‌ టీజర్‌లోనే పలు శృంగారపరమైన బహు విధాల భంగిమలు, కాత్సాయన కామ సూత్రను మించిన భంగిమలు కనిపిస్తున్నాయి. మరి టీజర్‌లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటాయో? ఇక వీరి మద్యనే కాదు.. రెజీనా కూడా తన అందాలతో మతిపోగుడుతోంది. వీరు చాలదన్నట్లుగా శ్రియా ఐటం సాంగ్‌ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా తనలోని పూర్తి మాస్‌ని బయటకి తీసిన కృష్ణవంశీలో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. 

Sai Dharam Tej Between Pragya Jaiswal Song in Nakshatram Movie:

Nakshatram Movie director by Krishna Vamsi. krishna vamsi createde by a song between Sai Dharam Tej and Pragya Jaiswal in this movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs