Advertisement
Google Ads BL

ఈ ఆఫర్ ని అనుష్క ఒప్పుకుంటుందా?


అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్ని అనుష్కకి మంచి పేరే తీసుకొచ్చాయి. 'అరుంధతి, రుద్రమదేవి' వంటి చిత్రాలు అనుష్కని టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి. స్టార్ హీరోలకు ధీటుగా అనుష్క పేరు మార్మోగిపోయేది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో జోడి కట్టిన ఈ భామకి 'బాహుబలి' చిత్రం జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అయితే 'సైజ్ జీరో' తో బరువు పెరిగి దాన్ని కరిగించలేక అనుష్క నానా తంటాలు పడిన సంగతి తెలిసిందే. ఇక బరువు కాస్త తగ్గినా ఇంకొంచెం లావుగా ఉండడంతో ఆమెకు ఇక అవకాశాలు తగ్గుతాయని భావించారంతా.

Advertisement
CJ Advs

కానీ అనుష్క చేతిలో ఇప్పుడు అతి పెద్ద భారీ ప్రాజెక్టులే వున్నాయి. ఒకటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'భాగమతి' కాగా రెండోవది ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో అనుష్క దాదాపు ఫైనల్ అయ్యిందనే టాక్ వినబడుతుంది. ఇకపోతే అనుష్క టాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలోనే మెగాస్టార్ చిరు 'స్టాలిన్' లో ఒక ఐటెంలో చేసి ఆకట్టుకుంది. కానీ ఇప్పటి వరకు మరే ఇతర సినిమాలో ఐటెంలో నర్తించలేదు.

అయితే ఇప్పుడు మహేష్ 'భరత్ అనే నేను' సినిమాలో అనుష్కని ఐటెం సాంగ్ కోసం కొరటాల శివ బ్యాచ్  అప్రోచ్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్ - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐటెం సాంగ్ కూడా అదిరిపోయే లెవల్లో ఉండాలి అంటే అనుష్క తో చేయిస్తే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక అనుష్క ని అప్రోచ్ అయ్యారాలేదా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ఇక ఈ ఆఫర్ ని అనుష్క ఒప్పుకుంటుందా? లేదా అనేది కూడా డౌట్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?

Anushka Item Song in 'Bharath Ane Nenu' Movie:

Now, Koratala Siva's Bach Approach is a story of 'Bharat Ane Nenu' Anushk's item song in the film.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs