Advertisement
Google Ads BL

నయన్ పాంచాలి పాత్రకి ఎంత డిమాండ్ చేస్తుందో?


తమిళంలో నయనతార నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ హిట్ ట్రాక్ లో ఉన్న నయన్ తన రెమ్యునరేషన్ కూడా భారీ లేవల్లోనే వసూలు చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపెట్టే రకం. ఇక్కడ తెలుగులో ప్రస్తుతం నయనతార, బాలకృష్ణ - రవి కుమార్ చౌదరి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనికిగాను నయన్ 4  కోట్లు వసూలు చేస్తుందనే టాక్ కూడా వుంది.

Advertisement
CJ Advs

ఇకపోతే నయనతార ఇప్పుడు 1000  కోట్ల భారీబడ్జెట్ చిత్రంగా రాబోతున్న మహాభారతంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. శ్రీ మీనన్ డైరెక్షన్ లో బడా బిజినెస్ మాన్ 1000  కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మహాభారతాన్నితెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ మహాభారతంలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రకి ఎంపిక కాగా మిగతా పాత్రలకు కూడా నటీనటుల ఎంపిక జరుగుతుందట. అయితే ఈ చిత్రంలో పాంచాలి పాత్ర కోసం నయనతార ని మూవీ యూనిట్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ లో శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతార ఈ పాంచాలి పాత్రకి కూడా న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇకపోతే ఈ మహాభారత కోసం బీష్ముడిగా అంబరీష్, దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా రవిచంద్రన్ లను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అయితే ఒకమాదిరి బడ్జెట్ సినిమాలకే నయనతార షాకింగ్ రెమ్యునరేష్ రాబడుతుంది... మరి 1000  కోట్ల భారీ బడ్జెట్  చిత్రానికి ఇంకెంత డిమాండ్ చేస్తుందో అంటున్నారు.

Nayantara How much Remuneration Demand in Mahabharatham?:

Now Nayantara and Balakrishna - Ravi Kumar Chowdhary Combo Film have given the green signal to act as a heroine in the lead role. In this movie 4 crores demanded. But Mahabharatham movie Nayantara Remuneration demanded how much? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs