Advertisement
Google Ads BL

ప్రభాస్‌ దెబ్బకు ఆయన ఫ్యానైపోయాడు...!


'బాహుబలి'తో అదరగొట్టిన యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా సామాన్య సినీ ప్రేక్షకులే గాక కరణ్‌ జోహార్‌, రాంగోపాల్‌ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఫ్యాన్స్‌ అయిపోతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ తాను ప్రభాస్‌కి వీరాభిమానిగా మారానని చెప్పుకున్నాడు. ఆయన ఎవరో కాదు.. కపూర్‌ ఫ్యామిలీకి చెందిన రణబీర్ కపూర్‌. 

Advertisement
CJ Advs

ఈనెల 24న ఆయన నటించిన 'జగ్గాజాసూస్‌' చిత్రం విడుదల కానుంది, ఇందులో ఆయన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. కాగా ఆమద్య కత్రినా మాట్లాడుతూ, రణబీర్ కపూర్‌ ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తాడంటూ సెటైర్లు పేల్చింది. దానికి బదులుగా అన్నట్లుగా రణబీర్ మాట్లాడుతూ, అసలు కత్రినా కైఫ్‌కి నటించడమే చేతకాదు. నేనైనా కనీసం ఓవర్‌ యాక్షన్‌ చేస్తాను. కత్రినాకు అది కూడా రాదు. ఆమెకు బొత్తిగా నటనంటే తెలియని, ఆమె చేసిన పలు చిత్రాలలో ఆమె నటించలేదని దెప్పిపొడుపు పొడిచాడు. 

ఇక 'బాహుబలి' గురించి మాట్లాడుతూ, 'బాహుబలి'గా ప్రభాస్‌ తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేకపోతున్నాడు. ఆయన అదరగొట్టాడు. ఫిజిక్‌లోనే కాదు నటనలో కూడా ఆయన తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అందుకే నేను ఇప్పుడు మీ ఫ్యాన్‌ ఎవరు? అని అడిగితే సంకోచించకుండా ప్రభాస్‌ పేరు చెబుతాన్నాడు. క్యా బాత్‌హై...! 

Prabhas is the Ranbir Kapoor Favorite Hero:

Actor Ranbir Kapoor has joined the list of fans of 'Baahubali' star Prabhas.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs