Advertisement
Google Ads BL

జై టీజర్- సముద్రమంత ఊపిచ్చింది..!


బుల్లితెర మీద బిగ్ బాస్ ప్రోమోస్ తో హల్చల్ చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' లోని 'జై' టీజర్ తో వచ్చేశాడు. చెప్పిన టైంకే అంటే ఈ రోజు గురువారం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు 'జై' టీజర్ ని విడుదల చేసింది 'జై లవ కుశ' చిత్ర యూనిట్. మరి ముందు నుండి చెబుతున్నట్టే మొదటగా 'జై' పాత్రని పరిచయం చేసే 'జై' టీజర్ ని, అలాగే 'లవ' పాత్రని పరిచయం చెయ్యడానికి 'లవ' టీజర్ తోనూ, 'కుశ' పాత్రని పరిచయం చెయ్యడానికి 'కుశ' టీజర్ తో వస్తామని చెప్పినట్లే ఇప్పుడు 'జై' టీజర్ తో అభిమానులను అలరించడానికి వచ్చేశాడు ఎన్టీఆర్.

Advertisement
CJ Advs

మరి  మొదటినుండి ప్రచారం జరుగుతున్నట్టే 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ 'జై' పాత్రలో పూర్తి నెగెటివ్ షేడ్స్ లోనే నత్తి మాట్లాడుతూ కనబడుతున్నాడు. సుర... అసుర... సుర...అసుర  అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కారులో నుండి కాలు బయటికి పెట్టి తన ఇష్ట దైవం రావణాసురుడికి దణ్ణం పెడుతూ నడిచొచ్చే 'జై' పాత్రలో ఎన్టీఆర్ సూపర్ పెరఫార్మెన్సుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ 'ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ. ధ ధ ధ ధైర్యం ఉండాలా' అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. 

డైరెక్టర్ బాబీ ఎన్టీఆర్ ని మాంచి మాస్ లుక్ తోనే చూపించాడు. విలన్ కుండాల్సిన అన్ని లక్షణాలు ఎన్టీఆర్ లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. మరి 'జై' పాత్రతో అదరగొట్టిన ఎన్టీఆర్ మిగతా కేరెక్టర్స్ ఎలా వుండబోతున్నాయో అనే క్యూరియాసిటీని అందరిలో పెంచేశాడు. ఇకపోతే 'జై లవ కుశ' బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. మరి ఒక్క టీజర్ తోనే ఉరుకులు పెట్టిస్తున్న ఎన్టీఆర్.. మిగతా రెండు లుక్ లు, టీజర్స్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Click Here to See the Jai Teaser

Jai Lava Kusa Movie Jai Teaser Released:

Nandamuri Kalyanram Produced and Young Tiger NTR acted Jai Lava Kusa Movie Jai Teaser Released. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs