సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న కృష్ణ వంశీ చిత్రం 'నక్షత్రం' ఇక వెలుగు చూడదేమోనని అందరూ నిరుత్సాహపడుతున్న వేళ ఈ చిత్రం ఆడియో తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, తాను 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్ స్పాట్‌కి వెళ్లినప్పుడు కృష్ణవంశీ గారితో మీ చిత్రంలో ఓ పాత్ర ఉంటే ఇవ్వమని కోరాను. ఆయన నా కలను ఇంత త్వరగా నెరవేరుస్తారని భావించలేదు.
ఇందులో పవర్‌ఫుల్‌గా ఉండే అలెగ్జాండర్ అనే పాత్రను పోషించాను. కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తున్నానని చెప్పగానే మా మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు నాకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో నటిస్తున్నావంటే ఆయన నుంచి నటనలో ఎంతో నేర్చుకోవచ్చని చిరంజీవి మావయ్య చెప్పారు.. అన్నాడు.ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌తో పాటు ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన 'లాయిరే.. లాయిరే' అనే సాంగ్ ప్రోమోలో కృష్ణవంశీ తనదైన మార్క్ చూపించాడు.
హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు, పెద్ద వంశీల తర్వాత తానేనని ఈ పాటతో ఆయన నిరూపించాడు. ఈ చిత్రంలో కృష్ణవంశీ టేకింగ్‌కితోడు రెజీనా అందాల ఆరబోత, కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్ చూస్తే ఎవరైనా అటే చూస్తు ఉండిపోవాల్సిందే అనిపిస్తోంది.ఇక పాట ప్రోమోనే అలా ఉంటే ఇక వెండితెరపై పూర్తి పాటలతో పాటు అన్ని పాటలు ప్రేక్షకులను ఏ విధంగా అల్లరిస్తాయో చూచాయగా అర్ధమవుతోంది.