Advertisement
Google Ads BL

'సాహో' అనుష్క..'సాహో'!


టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు అనుష్క, ప్రభాస్ జంట. వీరిద్దరూ బిల్లా, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలలో జోడి కట్టారు. అయితే వీరు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను జంటగా మారుతున్నారని గాసిప్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయం పై అనుష్క సైడ్ నుండి..  నిజం కాదని క్లారిటీ వచ్చింది. అప్పటితో ఆ గాసిప్స్ కి కాస్త బ్రేక్  పడింది.

Advertisement
CJ Advs

అయితే  సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సాహో' సినిమాలో ఇంతవరకు హీరోయిన్ గా ఎవరు ఫైనల్ కాలేదు. ముందు నుండి బాలీవుడ్ భామలను 'సాహో' కోసం  దించుతున్నారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు  అదేం లేదని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కి జోడిగా ఇంకా చాలా మంది పేర్లే వినబడ్డాయి. మొదటినుండి ప్రభాస్ కి జోడిగా అనుష్క మరోసారి జోడీకడుతుందని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు అదే నిజమని అంటున్నారు. 'బాహుబలి' తర్వాత ఈ జంట మరోసారి 'సాహో'లో నటిస్తుందని చెబుతున్నారు. 'సాహో' సినిమాలో హీరోయిన్ గా అనుష్కను ఫైనల్ చేసినట్టు సినీ ప్రముఖులు కొందరు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. 'సాహో' తో అనుష్క బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ కూడా వారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న 'సాహో' సినిమాలో అనుష్కయే ‘లీడింగ్ లేడీ’ అంటూ సోషల్ మీడియా కన్ఫర్మ్ చేసినప్పటికీ.... ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ కానీ, చిత్ర యూనిట్ కాని ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Anushka Shetty finalised opposite Prabhas in Saaho!:

After the names like Katrina Kaif, Shraddha Kapoor and Disha Patani made news, it was then his Baahubali co-star Anushka Shetty’s turn to grab the news. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs